Allu Arjun: సినీ నటుడు అల్లు అర్జున్ పై కేసు నమోదు అయిన విషయం మనకు తెలిసిందే ఆయనపై పోలీసులు ఎలాంటి కేసు పెట్టారు. ఒకవేళ ఈ కేసులో ఆయనకు శిక్ష పడితే ఎలాంటి శిక్ష పడుతుంది అనే విషయాల గురించి మాజీ సీబీఐ ఎం జెడి లక్ష్మీనారాయణ తెలియజేశారు. ఈ సందర్భంగా ఈయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..
అల్లు అర్జున్ పై పోలీసులు నమోదు చేసిన కేసు ఏంటి అనే విషయం గురించి మాట్లాడుతూ సినిమా రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ థియేటర్ వద్దకు వస్తే పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకొని తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉంది ఈ తొక్కిసలాటలో భాగంగా ప్రాణాలు కూడా కోల్పోవచ్చనీ ఆ విషయం అల్లు అర్జున్ కి తెలిసి కూడా సంధ్య థియేటర్ వద్దకు వచ్చారు అంటూ ఆయనపై కేసు నమోదు చేసినట్లు మాజీ సిబిఐ లక్ష్మి జెడి లక్ష్మీనారాయణ తెలిపారు.
ఇక ఈ విషయంలో అల్లు అర్జున్ పై కేసు నమోదు కావడంతో ఆయనకు ఈ కేసులో శిక్ష పడితే కనుక యావర్జీవ కారాగార శిక్ష పడొచ్చు లేదంటే 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి అంటూ ఈయన తెలియజేశారు. అయితే ఈ కేసు గురించి కూడా ఈయన మాట్లాడుతూ ఈ ప్రమాదం అనేది ఉద్దేశపూర్వకంగా జరిగినది కాదు ఇలాంటి సంఘటనలు గతంలో కూడా చాలా జరిగాయని తెలిపారు.
ఇలా గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు ఎవరిమీద కేసు నమోదు చేసే అరెస్టులు చేయలేదు. ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అంటూ పోలీసులు కేసును కూడా క్లోజ్ చేశారు కానీ ఇలా అల్లు అర్జున్ మాత్రమే అరెస్టు చేశారని తెలిపారు. గతంలో సల్మాన్ ఖాన్ కార్ డ్రైవ్ చేసుకుంటూ ఫుట్ పాత్ పైకి వెళ్ళనిచ్చారు ఆ సమయంలో కొంతమందికి గాయాలు అయ్యాయి అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అని పోలీసులు తెలియజేశారు.
ఇక గోదావరి పుష్కరాల సమయంలో కూడా తొక్కిసులాట ఘటనలో భాగంగా దాదాపు 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు అయితే ఇది కూడా ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అని తెలిపారు. ఓ సినిమా థియేటరుకి స్టార్ హీరో వస్తున్నాడని తెలిసినప్పుడు థియేటర్ యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిందనీ, ముందుగా పోలీసులకు సమాచారం ఇచ్చి వుంటే తగు చర్యలు తీసుకునేవారని లక్ష్మీనారాయణ తెలియచేశారు.