కంగారులో నిజాలు చెప్పేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు తెలంగాణను గట్టిగా తాకాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ కుమార్తెపై తీవ్ర ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. కేసీయార్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించనుంది. గతంలోనూ ఈ కేసులో ఆమె విచారణను ఎదుర్కొన్నారు. తాజా పరిణామాలపై కవిత మీడియాతో మాట్లాడుతున్నారు. నేషనల్ మీడియాతో మాట్లాడుతూ కవిత చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.

కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ, రాజకీయ ప్రత్యర్థుల్ని అక్రమ కేసులతో వెంటాడుతోందని ఆరోపించారు కవిత. అదే సమయంలో, ‘ఏం మీ పార్టీలోనే అవినీతి పరులు వుండాలా.? వేరే పార్టీల్లో వుండకూడదా.?’ అంటూ ఆమె ప్రశ్నించడం అందర్నీ విస్మయానికి గురిచేసింది.

ఓ హిందీ న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. కవిత కంగారులో నిజం చెప్పేశారనీ, అవినీతికి తాను పాల్పడినట్లు ఒప్పేసుకున్నారనీ.. సదరు వ్యాఖ్యల క్లిప్పింగ్‌తో బీజేపీ సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది.

ఇప్పుడంతా కట్ అండ్ పేస్ట్ వ్యవహారం నడుస్తోంది సోషల్ మీడియా వేదికగా. రాజకీయ నాయకులు కావొచ్చు, సెలబ్రిటీలు కావొచ్చు.. మాట మీద అదుపుతో వ్యవహరించాలి. లేకపోతే, ఇదిగో ఇలాగే వుంటుంది. మొత్తం లిక్కర్ స్కామ్ అంతా కవిత కేంద్రంగానే జరిగిందన్న ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. రేపో మాపో ఈ కేసులో కవిత అరెస్టవుతారన్న ప్రచారమూ జరుగుతోంది. ‘అరెస్టయితే ఏమవుతుంది.? జైల్లో పెడతారు.. అంతే కదా.?’ అంటూ గతంలో కవిత చేసిన వ్యాఖ్యలూ వివాదాస్పదమయ్యాయి.

YouTube video player