బిగ్ బ్రేకింగ్: పిళ్లై యూ టర్న్… కవిత ఫ్యాన్స్ హ్యాపీ!

హైదరాబాద్ వ్యాపారవేతా అరుణ్ రాంచంద్ర పిళ్లైని ఈడీ అరెస్టు చేయడం, అనంతరం తాను కవిత బినామీనన్న విషయం తమ వద్ద అంగీకరించినట్లు అతడి రిమాడ్ రిపోర్టులో పేర్కొనడం. అనంతరం కవితకు రెండోసారి నోటీసులు రావడంతో బీఆరెస్స్ శ్రేణులు – కవిత అభిమానులు జరగబోయే పరిణామాలను ఊహించుకుంటూ నరాలుతెగే ఉత్కంఠకు లోనయిన సంగతి తెలిసిందే. అయితే ఉన్నపలంగా కవితకు కాస్త రిల్ల్ఫ్ ఇచ్చే విషయం వెలుగులోకి వచ్చింది!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త రామచంద్రన్ పిళ్లై.. గతంలో తాను ఈడీకి ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకునేందుకు అనుమతి కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో తాను ఈడీ అధికారులకు చెప్పిన మాటలు వెనక్కి తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని కోరారు. అయితే.. పిళ్లై వేసిన ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన రౌస్ అవెన్యూ న్యాయస్థానం… ఈమేరకు ఈడీకి నోటీసులు జారీ చేసింది.

అరుణ్ రామచంద్రన్ పిళ్లై గతంలో ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే బీఆరెస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ ప్రశ్నించబోతున్న తరుణంలో… రామచంద్రన్ పిళ్లై ఈ టర్న్ తీసుకోవడం సంచలనమనే చెప్పాలి. కాగా… తాను ఎమ్మెల్సీ కవిత ప్రతినిధిని అని తమ విచారణలో ఒప్పుకున్నట్లు ఈడీ అతడి రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న సంగతి తెలిసిందే! అయితే ఉన్నపలంగా పిళ్లై “అప్పుడు చెప్పిన మాటలు వెనక్కి తీసుకుంటాను” అని ప్రకటించడంతో.. ఈ కేసులో బిగ్ ట్విస్ట్ వచ్చిందనే అనుకోవాలి. దీంతో.. కవితతోపాటు బీఆరెస్స్ శ్రేణులకు కాస్త రిలీఫ్ ని ఇచ్చే ఇషయం ఇది అని అంటున్నారు విశ్లేషకులు!