రాజగోపాల్ రెడ్డి ఓటమి.. బీజేపీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఇవే!

మునుగోడు ఉపఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటమి బీజేపీకి భారీ షాక్ అనే సంగతి తెలిసిందే. అధికార పార్టీతో పోల్చి చూస్తే బీజేపీ ఓటుకు తక్కువ మొత్తం ఇచ్చిందని ఈ రీజన్ వల్లే ఎన్నికల్లో ఓటమిపాలైందని కొంతమంది ప్రచారం చేస్తుండటం గమనార్హం. అయితే తెరాస మరీ భారీ మెజారిటీని మాత్రం సొంతం చేసుకోలేదని అదే సమయంలో కొంతమంది కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

అయితే రాజగోపాల్ రెడ్డి ఓటమితో బీజేపీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఉపఎన్నిక సాధారణంగా ప్రత్యేక కారణాల వల్ల రావాలే తప్ప కోరి ఉపఎన్నికను తెచ్చుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. అదే సమయంలో ఉపఎన్నిక కోసం బీజేపీ కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి బదులుగా ఆ డబ్బును ప్రజలకు ప్రయోజనం చేకూర్చడం కోసం ఖర్చు చేస్తే బాగుండేదని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మునుగోడులో బీజేపీ బలం గతంతో పోలిస్తే పుంజుకుందని కొంతమంది కామెంట్లు చేస్తుండటం గమనార్హం. తెరాస సైతం భారీ మొత్తంలో ఖర్చు చేస్తే మాత్రమే ఎన్నికల ఫలితాలు అంతోఇంతో అనుకూలంగా ఉన్నాయి. బీజేపీ ఇంకొంచెం కష్టపడి ఉంటే ఎన్నికల ఫలితాలు బీజేపీకే అనుకూలంగా ఉండేవని మరి కొందరు కామెంట్లు చేస్తుండటం గమనార్హం. మునుగోడు ఉపఎన్నిక తెలంగాణ రాజకీయ పార్టీలకు చాలా గుణపాఠాలను నేర్పించింది.

ఇతర పార్టీలతో పొల్చి చూస్తే కాంగ్రెస్ ఇంకొంచెం తక్కువ మొత్తం డబ్బు పంపిణీ చేసిందని ఆ కారణం వల్లే ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి మరింత షాక్ ఇచ్చే విధంగా ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. 2024 ఎన్నికల్లో ప్రధానంగా తెరాస, బీజేపీ మధ్య పోటీ ఉండనుందని ప్రచారం జరుగుతుండటం గమనార్హం.