భార్య, అత్తను ఈ పోలీసు ఎలా కొట్టిండో చూడండి (వీడియోలు)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. మణుగూరు ఎస్సై జితేందర్ తన భార్యను విచక్షణా రహితంగా కొట్టడంతో ఆమె తీవ్రగాయాలపాలయ్యింది. ఇష్టమొచ్చినట్టు కొట్టడంతో ఆమె శరీరంపై తీవ్రగాయాలయ్యి నోటిలోని పళ్ళు ఊడిపోయి రక్తం కారింది. అడ్డు వచ్చిన అత్తను కూడా ఎస్సై కొట్టడంతో ఆమె స్పృహ కోల్పోయి కింద పడ్డది. ఎస్సై తన భార్యను కొట్టిన వీడియో కింద ఉంది చూడండి.

మణుగూరు ఎస్సై జితేందర్ వరంగల్ జిల్లా వాసిగా తెలుస్తోంది. అతను మణుగూరులో ఎస్పైగా పనిచేస్తున్నాడు. పాల్వంచకు చెందిన ముస్లిం అమ్మాయి ఫర్వీన్ ని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. అయితే జితేందర్ గత కొంత కాలం నుంచి భార్యతో గొడవపడి దూరం పెట్టాడు. జితేందర్ కు మరో మహిళతో అక్రమ సంబంధం ఏర్పడటం వల్లనే తనను దూరం పెట్టాడని ఫర్వీన్ ఆరోపిస్తుంది. దీంతోనే వారిరువురి మద్య గొడవలు ప్రారంభమయ్యాయి.దీంతో ఆమె తన అమ్మగారింటికి పోయి ఉంటుంది. గురువారం రోజు మహిళ సంఘాలను తీసుకొని ఎస్సై ఇంటికి వచ్చింది. ఫర్వీన్ మహిళ సంఘాలను తీసుకురావడంతో ఆగ్రహం చెందిన ఎస్స్పై ఫర్వీన్ పై విచక్షణ రహితంగా దాడి చేశాడు. అడ్డు వచ్చిన ఫర్వీన్ తల్లిని కూడా కొట్టాడు. దీంతో వారి పరిస్థితి  విషమంగా ఉండటంతో స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స నందిస్తున్నారు. భార్యపై దాడి చేసిన ఎస్పై ని అరెస్టు చేసి బాధితురాలికి న్యాయం చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి.