ప్రస్తుత కాలంలో యువతీ యువకులు చెడు వ్యసనాలకు అలవాటు పడి వాటికి బానిసలుగా మారుతున్నారు. వ్యసనాలకు దూరంగా ఉండమని పెద్దలు చెప్పటానికి ప్రయత్నాలు చేస్తే .. చెప్పిన మాట వినకపోగా కోపంతో తిరిగి వారి మీద దాడి చేస్తున్నారు. తాజాగా ఇటువంటి సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మందు తాగవద్దని వారించిన ఒక విశ్రాంత ఉద్యోగి మీద యువకులు దాడి చేసిన ఘటన చర్చంశనీయంగ మారింది. అంత కాకుండా ఈ దాడిలో కార్పొరేటర్ కుమారుడి హస్తం ఉండటటం గమనార్హం.
వివరాలలోకి వెళితే…నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్యానగర్ లోని ఎల్జీ స్విమ్మింగ్ పూల్ ప్రాంతంలో విశ్రాంత ఎక్సైజ్ సీఐ లక్ష్మణ్ నాయక్ ఇల్లు నిర్మించుకొని కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం లక్ష్మణ్ నాయక్ తమ అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చి చూడగా పక్కన ఉన్న భవనం వద్ద కొందరు యువకులు మద్యం సేవిస్తున్నారు. దీంతో లక్ష్మణ్ నాయక్ యువకుల వద్దకు వెళ్లి ఇక్కడ ఇలా మద్యం సేవించడం కరెక్ట్ కాదని, పైగా ఈ ప్రదేశంలో తరచూ దొంగతనాలు జరుగుతున్నాయని, వెంటనే అక్కడినుండి వెళ్ళమని యువకులకు చెప్పాడు.
దీంతో మద్యం సేవిస్తున్న యువకులు అక్కడి నుండి వెళ్ళకపోగా.. అతనితో వాగ్వాదానికి దిగారు. ఈ యువకులలో ఒకరు కార్పొరేటర్ కుమారుడు ఉండగా అతని తండ్రికి సమాచారం అందించారు. దీంతో కార్పొరేటర్ భర్త అక్కడికి చేరుకున్న తర్వాత మళ్లీ యువకులు రిటైర్డ్ ఎక్సైజ్ సీఐ లక్ష్మణ్ నాయక్ పై కర్రలతో దాడికి పాల్పడ్డారు. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు లక్ష్మణు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఏసీపీ వెంకటేశ్వర్లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. భవనం వద్ద దాడి జరగటంతో అక్కడ మరకలు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి, పలు దర్యాప్తు ప్రారంభించినట్టు పోలిసులు తెలిపారు.