TG: మళ్లీ మీరే కావాలి.. మీరే రావాలి… కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ వాసులు వ్యతిరేకిస్తున్నారా?

TG: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడిందని స్పష్టమవుతుంది దీంతో మళ్లీ బిఆర్ఎస్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారా అంటే అవుననే తెలుస్తుంది ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రేవంత్ సర్కార్ నిర్ణయం పట్ల ప్రజలందరూ కూడా ఎంతో ఆగ్రహానికి లోనవుతూ ఎందుకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చామా అని భావిస్తున్నట్లు పలువురు మీడియా సమావేశాలలోనే తెలియజేశారు.

ఇకపోతే తాజాగా తెలంగాణలో బిఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి మహిళలందరూ మళ్ళీ మీరే కావాలి మీరే రావాలి అంటూ చెప్పడం పట్ల రేవంత్ పార్టీకి ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టంగా అర్థం అవుతుంది.ఇటీవల నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి పితృ వియోగం కలుగగా.. ఆయనను పరమర్శించడానికి తిమ్మాజీపేట్ మండలం నేరపళ్లపల్లి మాజీమంత్రులు వెళుతున్నారు.

ఈ క్రమంలోనే మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు అలాగే ఇతర పార్టీ నేతలు అందరూ కూడా జనార్దన్ రెడ్డిని పరామర్శించడానికి వెళ్లారు అయితే అక్కడ మహిళలు పెద్ద ఎత్తున వీరికి నీరాజనాలు పలికారు. ఏకంగా 150 మంది మహిళలు వీరికి గుమ్మడి కాయలతో దిష్టి తీస్తూ మళ్ళీ మీరే రావాలి మీరే కావాలి అంటూ ఆ దేవుడి ఆశీస్సులు మీపై ఉంటాయి అంటూ మహిళలందరూ ముక్తకంఠంతో తెలియ చెప్పారు.

ఇలా బిఆర్ఎస్ నేతలకు రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి ఆదరణ చూస్తేనే తెలంగాణలో కాంగ్రెస్ పట్ల ఎలాంటి వ్యతిరేకత ఉందనేది స్పష్టం అవుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు పరచడంలో పూర్తిగా విఫలమైన సంగతి తెలిసినదే దీంతో పెద్ద ఎత్తున పార్టీకి వ్యతిరేకత ఏర్పడుతోంది.