Shyamala: రేవంత్ పై ఫైర్ అయిన యాంకర్ శ్యామల… తెలంగాణ సమస్యలను పరిష్కరించండి అంటూ?

Shyamala: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అల్లు అర్జున్ టార్గెట్ చేయడం పట్ల ఎంతో మంది సినీ సెలెబ్రెటీలు స్పందించారు. అయితే తాజాగా వైకాపా ప్రతినిధి యాంకర్ శ్యామల సైతం ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ రేవంత్ రెడ్డిని ఎన్నో ప్రశ్నలు వేశారు. తెలంగాణలో ఎన్నో సమస్యలు ఉండగా రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ రెడ్డి టార్గెట్ చేయడం సమంజసం కాదని తెలిపారు. ఈ ఘటనలో బాధితురాలు మరణం అనేది ఎంతో దురదృష్టకరం కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సమస్యలు ఉండగా పోలీసులు ముఖ్యమంత్రి అల్లు అర్జున్ ని టార్గెట్ చేయడాన్ని ఈమె ఖండించారు.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ఎంతోమంది రైతులు నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుని మరణించారు గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం కారణంగా ఎంతో మంది చనిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. అల్లు అర్జున్ విషయంలో పోలీసులు రేవంత్ రెడ్డి చూపుతున్నటువంటి శ్రద్ధ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలపై చూపితే ఇలాంటి ఆత్మహత్యలు జరగవని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎన్నో ముఖ్యమైన సమస్యలు ఉండగా, పదేపదే అల్లు అర్జున్ గారి అంశాన్ని హైలైట్ చేయడం సరైన విధానం కాదు.ఇప్పుడు వారి ఇంటిపై దాడి జరగడం, ఆ ఘటనను హైలైట్ చేసి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించడం తగదు. మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి, దృష్టి పెట్టాల్సింది ప్రజల సమస్యల పైన అలాగే రాష్ట్ర సమస్యల పైన మాత్రమే దృష్టి పెట్టండి ఇప్పుడు నేను ఇలాంటి ప్రశ్నలు వేసినందుకు నాపై కేసులు వేసి నోటీసులు ఇస్తారేమో ఆయన నేను భయపడనని ప్రజల సమస్యకై ఎప్పుడూ పోరాడుతూనే ఉంటామని ఈ సందర్భంగా శ్యామల చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.