Allu Arjun: సినీ నటుడు అల్లు అర్జున్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా వివాదంలో చిక్కుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ ఘటనలో అభిమాని మరణించడంతో అల్లు అర్జున్ రావడమే అందుకు కారణమని పోలీసులు ఈయనని అరెస్టు చేశారు అయితే మద్యంతర బెయిల్ రావడంతో బయటికి వచ్చిన అల్లు అర్జున్ కు ఇటీవల నాంపల్లి హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.
ఇలా అల్లు అర్జున్ కు రెగ్యులర్ పైల్ మంజూరు కావడంతో ఆయన న్యాయవాది అశోక్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా లాయర్ అశోక్ రెడ్డి మాట్లాడుతూ…అల్లు అర్జున్ కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిందని, రూ.50 వేల పూచికత్తుతో ఇద్దరు సాక్షి సంతాలతో కూడిన బాండ్ ను కోర్టుకు అందజేయాలని అశోక్ రెడ్డి తెలిపారు.
ఇలా అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ రావడమే కాకుండా ప్రతి ఆదివారం ఈయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లి వ్యక్తిగతంగా హాజరు కావాలని తెలిపారు. అయితే కేసు ముగిసే వరకు విచారణకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు హాజరు కావాల్సి ఉంటుందని లాయర్ వెల్లడించారు.ఇక ఈ కేసులో చనిపోయిన రేవతిది ఉద్దేశపూర్వకంగా చేసిన హత్య కాదని కోర్టు నిర్ధారించిందని, అందకే బెయిల్ మంజూరు చేసినట్లు అశోక్ రెడ్డి తెలిపారు.
ఇక ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ హైకోర్టులో ఉందని, దీనిపై ఈ నెల 21న విచారణ జరుగుందని అన్నారు. అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఈ పిటిషన్ కనుక సక్సెస్ అయితే ఈ కేసుకు అల్లు అర్జున్ కు ఏ మాత్రం సంబంధం ఉండదు. ఇక అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ ప్రకటించడంతో అల్లు అర్జున్ కు ఎంతో ఉపశమనం కలిగిందని చెప్పాలి. ఇక్కడ కనుక తనకు బెయిల్ రాకపోతే ఈపాటికి తిరిగి బన్నీ జైలుకు వెళ్లాల్సి ఉండేదని తెలుస్తోంది.