ఆర్టీసి బస్సులు ఢీ గాయపడిన 18 మంది మహిళలు?

ప్రతిరోజు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని ప్రమాదాల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఆర్టీసీ బస్సులు రెండు ఒకదానితో ఒకటి ఢీ కొట్టిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ప్రాణనష్టం లేకపోయినా కూడా 18 మంది మహిళలు తీవ్ర గాయాల పాలై ప్రాణాలతో బయటపడ్డారు.

వివరాలలోకి వెళితే…. ఇటీవల తెలంగాణ జాతీయ సమైక్యత వారోత్సవాలను నిర్వహించారు. ఈ వారోత్సవాల కోసం యాదాద్రి భువనగిరి జిల్లా చుండూరు మండల్ కేంద్రంలో ఉన్న రెవెన్యూ ఆఫీసర్లు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అంగన్వాడి కార్యకర్తలు , ఫీల్డ్ అసిస్టెంట్లు, రేషన్ డీలర్లు విబికెలు పాల్గొన్నారు. అయితే వారోత్సవాలు ముగిసిన తర్వాత వీరందరిని ఆర్టీసీ బస్సులో తిరిగి వారి ప్రదేశాలకు తరలించే సమయంలో రెండు ఆర్టీసీ బస్సులు ఒకదానితో ఒకటి ప్రమాదవశాత్తు ఢీకొన్నాయి.

ఆ సమయంలో రెండు ఆర్టీసీ బస్సుల్లో మొత్తం 80 మంది దాకా మహిళలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరిలో 18 మంది మహిళలు గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు గాయపడిన వారిని 108 లో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.