తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు.. అసెంబ్లీ ఆవరణ వెలుపల ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి అసెంబ్లీ ఆవరణలో తోటి ఎమ్మెల్యేలకు స్వాగతం పలికారు. అయితే ఎమ్మెల్యేలకు స్వాగతం పలికే క్రమంలో ఆయనకు కొందరు ఎమ్మెల్యేలు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ముందుకు వెళ్లగా బాజిరెడ్డి మాత్రం షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వారికి నమస్కారం చేశాడు.
అయితే బాజిరెడ్డి తీరుకు షాక్ అయిన ఎమ్మెల్యేలు తర్వాత కరోనా విషయం తెలుసుకుని నవ్వుతూ తిరిగి నమస్కారం చేసి అసెంబ్లీ హాల్ లోకి వెళ్లిపోయారు. అయితే తెలంగాణలో కరోనా కేసు ఒక్కటి మాత్రమే నమోదైంది.. అది కూడా విదేశాల నుండి వచ్చిన వ్యక్తికే కరోనా సోకిందని, తెలంగాణ వారికి ఎవరికీ రాలేదని ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వ్యాపించకుండా ముందస్తు పకడ్భందీ చర్యలు తీసుకుంది. కరోనాపై విసృత ప్రచారం చేసింది.
ఆ శ్రమ ఫలితమే కరోనా వైరస్ను నియంత్రించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్రం ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి హర్షవర్ధన్ అభినందించారు. కోవిడ్-19ను నియంత్రించడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీసుకున్న చర్యలను మిగతా రాష్ట్రాలు కూడా అనుసరించాలని సూచించారు.