ఉపాధీ హామీ కూలీలు… ఓ మంత్రి ముచ్చట..!

ఉపాధీ హామీ కూలీలు... ఓ మంత్రి ముచ్చట..!

నేనే మీ మంత్రిని…! పనులు ఎలా జరుగుతున్నాయి? కరోనా గురించి తెలుసా…? లాక్ డౌన్ పాటిస్తున్నారా..? కరోనా పోయే దాకా జాగ్రత్తగా ఉందాం.. దూరం పాటిస్తూ.. భవిష్యత్తుకు ఉపయోగ పడే పనులు చేద్దాం.. ఈ మాటలు అన్నది ఓ మంత్రి.. విన్నది ఉపాధి హామీ కూలీలు.. కదా శ్రమైక జీవన సౌందర్యం కళ్లకు కట్టిన దృష్యం.. కరోనా విపత్తు సమయంలో నిబంధనలు పాటిస్తూ.. కూలీలు పనులు చేసుకుంటుండగా.. ఓ మంత్రి వారితో ముచ్చటించిన వైనం..

తెలంగాణ రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు వ‌రంగ‌ల్ రూర‌ల్, మ‌హ‌బూబాబాద్ జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు వెళ్లారు. దారిలో మ‌హ‌బూబాబాద్ జిల్లా పెద్ద వంగ‌ర మండ‌లం కిష్టు తండా దగ్గర కాలువ ప‌నులు చేస్తున్న కూలీలను చూసి అక్కడ ఆగారు.

కారు దిగి.. పొలం గట్టు మీద నడిచారు. పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి.. వారిని పలకరించారు. నేను ఎవ‌రో తెలుసా… మీ మంత్రిని.. నేనే… అని అనండంతో కూలీలంతా తెలుసు అని చెప్పారు. మీరే మా మంత్రి, అంతా మంచిగ‌నే ఉంది సారు అని అన్నారు. భవిష్యత్తుకు ఉప‌యోగప‌డే ప‌నులే చేయండి అంటూ కూలీల‌కు సూచించారు మంత్రి.

ఆ తర్వాతక‌రోనా గురించి కూడా అడిగారు. లాక్ డౌన్ పాటిస్తున్న‌రా? అని ప్రశ్నించారు. క‌రోనా వెళ్లిపోయే వరకు సీఎం కెసిఆర్ చెప్పిన‌ట్లు చేద్దామని, ఇంకా దూరం దూరంగా ఉండి పనులు చేసుకోవాలని అన్నారు. మంత్రి నేరుగా వచ్చి అలా మాట్లాడే సరికి కూలీలు ఉత్సాహంగా సమాధానాలు చెప్పారు. మంత్రి వెళ్లిపోగానే ఆనందం వ్యక్తం చేశారు. తమ పనుల్లో మునిగిపోయారు.