తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తెరాస పార్టీకి ప్రజలు షాకిచ్చారని, ముఖ్యంగా కేటీఆర్ కు గట్టి దెబ్బ కొట్టారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఎన్నికల ఫలితాలు విడుదల సందర్బంగా అయన మీడియాతో మాట్లాడుతూ బిజెపి అభ్యర్థులు ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టకుండా పోటీ చేసారని అయన అన్నారు. టిఆర్ ఎస్ పార్టీ కి జనం బాగా బుద్ధి చెప్పారని అన్నారు. ఈ ఎన్నిలల్లో టిఆర్ ఎస్ పార్టీ అధికార దుర్వినియోగం చేసిందని అన్నారు. ఓటరు లిస్ట్ నమోదు మొదలుకుని తెరాస ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని మండి పడ్డారు.
ఇంత ఖరీదైన ఎన్నికలు ఎక్కడ చూడలేదని, ఈ ఎన్నికల్లో బిజెపి పార్టీ మంచి ఫలితాలు సాధించిందని అన్నారు. ఈ సారి ఎన్నికల్లో .. బిజెపి పార్టీ మూడు మున్సిపాలిటీల్లో గెలిచామని చెప్పారు, మరికొన్ని మున్సిపాలిటీల్లో అత్యధిక స్థానాలు సాదించామని అన్నారు. నిజామాబాద్, అమన్ గల్, తుక్కుగూడ, మక్తల్, నారాయణ్ పెట్, మీర్ పెట్, నిజాం పేట్ ,రామగుండం లలో అధిక సీట్లు సాధించినట్టు లక్ష్మణ్ తెలిపారు. మంత్రి కేటీఆర్ ఇలాఖా లోనే బిజెపి పార్టీ నాలుగు సీట్లు గెలుచుకుంది, అంతే కాకుండా స్వతంత్ర అభ్యర్థులు 10 మందికి పైగా గెలిచారని అన్నారు. అంతే కాదు టిఆర్ ఎస్ రెబెల్స్ సిరిసిల్లలోనే గెలవడం సిగ్గుచేటన్నారు. ఇంత డబ్బు ఖర్చు పెట్టి, ఓట్లు కొనుగోలు చేసిన టిఆర్ ఎస్ ప్రభుత్వం పరిస్థితి ఇంత దారుణంగా ఉందన్నారు. మొత్తానికి ఈ మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ ఎస్ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది.