తీరం దాటిన వాయుగుండం

వాయివ్య బంగాళాఖాతంలో వాయిగుండం తీరం దాటింది. పశ్చిమబెంగాల్, ఉత్తర ఒడిశా మధ్య వాయిగుండం కేంద్రికృతమైంది. వాయిగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సముద్రంలో గంటకు 40-50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లోద్దని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది.తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. తెలంగాణలో కూడా నేడు రేపు వర్షాలు పడే అవకాశం ఉంది.