హుజూర్ నగర్లో కెసియార్ కు షాక్ తప్పేట్లు లేదు. ఈ నెల 21వ తేదీన నల్గొండ జిల్లాలోని హుజూర్ నగర్ అసెంబ్లీ ఉపఎన్నిక జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. మొన్నటి వరకూ టిఆర్ఎస్ కు మద్దతుగా నిలిచిన సిపిఐ నుండి షాక్ తగులుతుందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
ఈ ఉపఎన్నికలో గెలవటం ముఖ్యంగా అధికార టిఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కు అత్యంత ప్రతిష్టగా మారింది. కాంగ్రెస్ శాసనసభ్యుడు, పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపిగా గెలిచి ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేయటంతో ఉప ఎన్నిక అవసరం అయ్యింది. కాబట్టి న్యాయంగా మాట్లాడితే ఈ సీటు కాంగ్రెస్ దే అనటంలో సందేహం లేదు.
కానీ కెసియార్ పరిపాలనపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోయిందనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కాబట్టి ఈ ఉపఎన్నికలో గెలిచి తనపై జనాల్లో వ్యతిరేకత లేదని నిరూపించుకోవాల్సిన అవసరం కెసియార్ వచ్చింది. అదే సమయంలో కెసియార్ పాలనపై జనాల్లో వ్యతిరేకత ఉందని నిరూపించాలంటే తన సీటులో కాంగ్రెస్ ఎలాగైనా గెలివాల్సిందే. అందులోను ఉప ఎన్నికల్లో పోటి చేస్తున్నది తన భార్య పద్మావతే కావటంతో ఉత్తమ్ కు ప్రిస్టేజ్ గా మారిపోయింది.
పోటిలో టిడిపి, బిజెపిలు కూడా ఉన్నప్పటికీ పోటి మాత్రం టిఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యనే. అయితే మొన్నటి వరకూ టిఆర్ఎస్ కు మద్దతుగా నిలబడిన సిపిఐ పునరాలోచనలో పడిందట. ఆర్టీసి సమ్మె విషయంలో కెసియార్ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది సిపిఐ. ఈ నేపధ్యంలో సిపిఐ గనుక టిఆర్ఎస్ కు మద్దతు ఉపసంహరించుకుంటే……