కరోనా కారణంగా మంత్రి హరీష్ రావు.. !

 
తెలంగాణలో కేసీఆర్ తరువాత ఆ స్థాయి లీడర్లలో హరీష్ రావు కూడా ఒకరు.  నిజానికి కేటీఆర్‌ కు ప్రాధాన్యం పెంచే క్రమంలో హరీష్ రావు స్థాయి తగ్గించే ప్రయత్నం జరిగింది కానీ.. లేకపోతే కేసీఆర్‌  తరువాత తెలంగాణలో అంతటి సత్తా ఉన్న నాయకుడు  హరీష్ రావునే.   తెలంగాణలో ఆయనకున్న ఇమేజ్ కు ముఖ్య కారణం హరీష్ రావు పనితనమే. ఏ మంత్రిత్వ శాఖ అప్పగించిన అద్భుతంగా ఫలితాలు చూపిస్తూ  ప్రజలకు మేలు కలిగేలా ముందుకు వెళ్లడం హరీష్ రావు శైలి. 
 
 
నేడు హరీష్ రావు పుట్టిన రోజు. ప్రతి సంవత్సరం ఆయన పుట్టిన రోజు  నాడు వేలాది మంది అభిమానులు ఆయన్ను కలవడానికి చాల దూరాల నుండి వస్తారు. అయితే కరోనా కారణంగా ఈ సారి తన పుట్టిన రోజుకు ఎవరినీ కలవలేకపోతున్నానని హరీశ్ రావు తెలిపారు. ఈ రోజు వేడుకలు జరుపుకోవడం, కలవడం మీకు నాకు శ్రేయస్కరం కాదని, కరోనా వ్యాప్తి కారణంగా ఎలాంటి వేడుకలు కూడా జరపవద్దని కార్యకర్తలు, అభిమానులకు ఆయన సూచించారు. దయచేసి తనను కలవడానికి రావొద్దని.. నా పట్ల ప్రేమను చూపించిన వారందరికీ మరోసారి తలవంచి నమస్కరిస్తున్నన్నానని హరీశ్ రావు తెలిపారు.
 
 
కాగా  మంత్రి హరీష్ రావు కృతజ్ఙతలు తెలుపుతూనే  అభిమానులను నిరాశపరుస్తున్నందుకు మన్నించాలని ఆయన కోరుకున్నారు. ఇక నీటి పారుదల శాఖ మంత్రిగా ఆయనకున్న పేరు ప్రఖ్యాతుల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు.  ఆయనకు అంత మంచి పేరు రావడానికి ముఖ్య కారణం మాత్రం ఆయన ఏ స్థాయిలో ఉన్నప్పటికీ జనం మధ్యకు వెళ్లారంటే ఒక సామాన్యుడిలా మారిపోతారు. చాలా సులువుగా జనాల్లో కలిసిపోయి వారికి ముచ్చట్లు చెబుతుంటారు. అందుకే జనం కూడా ఆయన్ను తమవాడిలా ఓన్ చేసుకుంటారు.