అల్లుడా.. మజాకా.. వ్యూహం పన్ని కేసీఆర్‌కే షాక్ ఇచ్చాడు ! 

 త్వరలో జరగనున్న దుబ్బాక ఉప ఎన్నికలు కేసీఆర్ చాలా  సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే.  ఆ స్థానం తమదే అయినా వరుస ఎన్నికల నేపథ్యంలో  అక్కడ భారీ మెజారిటీతో గెలిచి తీరాలని కేసీఆర్  దృఢ సంకల్పంతో   ఉన్నారు.  విపక్షాలు  కాంగ్రెస్, బీజేపీలు సైతం దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచి తెరాసకు తామే ప్రత్యామ్నాయమని నిరూపించుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు.  సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో అప్పటివరకు మౌనంగా ఉన్న అసంతృప్తులు ఒక్కసారిగా గళం విప్పారు.  ఆనవాయితీ మేరకు ఉప ఎన్నిక టికెట్ రామలింగారెడ్డి కుటుంబానికి కేటాయిస్తారనే ప్రచారం మొదలవగానే ఎవరికివారు రాజకీయం స్టార్ట్ చేశారు. 

 KCR shocked with Haris Rao's capacity 
KCR shocked with Haris Rao’s capacity 

వర్గాలు కింద విడిపోయి టికెట్ మాకే ఇవ్వాలని, లేకుంటే రెబల్స్ గా మారుతామని, ప్రత్యర్థి పార్టీలకు పనిచేస్తామని ఎవరికివారు అధిష్టానానికి సంకేతాలు ఇస్తూ వచ్చారు.  దీంతో ఆర్ధిక మంత్రి, తెరాస కీలక నేత హరీష్ రావు రంగంలోకి దిగారు.  నియోజకవర్గంలో పర్యటిస్తూ నిత్యం పార్టీ శ్రేణులతో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.  సొంత జిల్లా కావడంతో హరీష్ రావుకున్న పరిచయాలు, నెట్వర్క్  బాగా కలిసొచ్చాయి.  ఎక్కడికక్కడ అసంతృప్తులను గుర్తించి  సర్దిచెప్పడంలో హరీష్ రావు సక్సెస్  అవుతున్నారు.  మొదట్లో రామలింగారెడ్డి కుమారుడికి టికెట్ ఇస్తే సహించేది లేదని మెజారిటీ తెరాస శ్రేణులు అడ్డంతిరిగాయి. 

 

వారిలో ఎక్కువమందిని హరీష్ రావు  శాంతింపజేసేశారు.  ఉప ఎన్నిక పార్టీకి,  కేసీఆర్‌కు ఎంత ముఖ్యమైనదో వివరించి కలిసికట్టుగా ఉండకపోతే ప్రత్యర్థుల గెలుపు ఖాయమని  చెప్పి అందరినీ ఒక తాటికి మీదకు తీసుకొస్తున్నారు.  ఇప్పటికే 80 శాతం మంది  అసంతృప్తులను హరీష్ రావు మేనేజ్ చేసేశారట.  మొదట్లో దుబ్బాక పరిస్థితి చూసి  తానే రంగంలోకి దిగాలని  భావించిన కేసీఆర్ ఆఖరిగా మేనల్లుడికి బాధ్యతలు అప్పగించారు. అప్పటికీ అన్ని పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు.  కానీ హరీష్ రావు మాత్రం తన రాజకీయ లౌక్యంతో  ప్రతికూల  పరిస్థితులను చాలా త్వరగానే  అదుపులోకి  తీసుకొచ్చారని, ఆయన పనితనానికి కేసీఆర్ సైతం ఒకింత ఆశ్చర్యానికి గురై  మెచ్చుకుంటున్నారని పార్టీ శ్రేణులు  చెప్పుకుంటున్నాయి.