ఈ మధ్యకాలంలో చిన్న వస్తువు నుంచి ఒక పెద్ద వస్తువు వరకు కొనుగోలు చేయాలన్న క్యాష్ పేమెంట్ ఇవ్వడం కాకుండా ఆన్లైన్ పేమెంట్ చేయడం పరిరపాటిగా మారింది. ఇలా ప్రతి ఒక్కరు ఎక్కువగా గూగుల్ పే ఫోన్ పే ద్వారా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయడం జరుగుతుంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ వచ్చిన తర్వాత డబ్బులు పంపడం జరుగుతుంది. అయితే గూగుల్ పే ను యుపిఐ పేమెంట్స్ కోసం ఎక్కువగా వాడుతున్నారు. గూగుల్ పేలో యూపీఐ ఐడి ఎలా మార్చుకోవచ్చు అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..
ముందుగా మీ మొబైల్ ఫోన్లో గూగుల్ పే యాప్ డౌన్లోడ్ చేసి మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడే యూపీఐ ఐడి జనరేట్ అవుతుంది. ఈ క్రమంలోనే గూగుల్ పే యాప్ ఓపెన్ చేసి కుడివైపు భాగంలో ప్రొఫైల్ పిక్చర్ పై ఒక క్లిక్ చేయాలి. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పై మరో క్లిక్ చేయాలి. ఇలా చేయగానే మీ ఆ బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం వస్తాయి. అయితే ఇందులో మీరు ఏ బ్యాంకు కైతే యూపీఐడి మార్చాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ పై క్లిక్ చేయడంతో అందుకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం వస్తాయి.
ఇప్పుడు నెక్స్ట్ మేనేజ్ యూపీఐ ఐడీస్ పైన క్లిక్ చేయండి.అకౌంట్‌కు క్రియేట్ అయిన యూపీఐ ఐడీలు వస్తాయి.కావాలంటే డిలిట్ చేయొచ్చు. లేకపోతే+క్లిక్ చేసి యూపీఐడిని క్రియేట్ చేసుకోవచ్చు ఇలా ఈ యూపీఐడి క్రియేట్ చేసుకోవడం వల్ల చాలా సులభంగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. యూపీఐ, రూపే కార్డుల ద్వారా విదేశాల్లో కూడా పేమెంట్స్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇలా యూపీఐడి ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడైనా నగదు బదిలీ చేయవచ్చు.
