ఈ స్మార్ట్ టీవి పై అమెజాన్ లో అదిరే ఆఫర్… నెలకురూ. 360 చెల్లిస్తే చాలు…?

సాధారణంగా పండుగలు, ప్రత్యేక రోజులలో ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అయిన అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి వాటిలో ఎలక్ట్రానిక్ వస్తువుల మీద డిస్కౌంట్ లు పెడుతూ ఉంటారు. తాజాగా ప్రముఖ సంస్థలు చెందిన స్మార్ట్ టీవి పై అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. స్కైవాల్ కంపెనీ కి స్మార్ట్ టీవీ అమెజాన్ లో అందుబాటులో ఉంది. 32 ఇంచులు ఉన్న ఎల్ఈడీ స్మార్ట్ టీవీ పై అమెజాన్ భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఏకంగా 60 శాతానికి పైగా తగ్గింపుతో ఈ స్మార్ట్ టీవీ సొంతం చేసుకోవచ్చు. అంతే కాకుండా బ్యాంక్ కస్టమర్లకు మరిన్ని ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

సాధారణంగా అమెజాన్‌లో 32 అంగుళాల ఈ స్మార్ట్ టీవీ ఎంఆర్‌పీ రూ. 19,125గా ఉంది. అయితే మీరు 61 శాతం డిస్కౌంట్తో దీన్ని ఇప్పుడు రూ. 7,499కే సొంతం చేసుకోవచ్చు. ఇంకా ఈ స్మార్ట్ టీవీపై ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్ కింద రూ. 749 వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. అప్పుడు మీరు ఈ టీవీ ని రూ. 6 వేల ధరలోనే కొనుగోలు చేయవచ్చు. అంతే కాకుండా ఈ స్మార్ట్ టీవీపై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద మీరు మీ పాత టీవీ ఇచ్చేస్తే.. కొత్త టీవీ పొందొచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది మీ పాత టీవీ మోడల్ ప్రాతిపదికన మారుతుంది. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద మీకు రూ. 2,050 వరకు తగ్గింపు వస్తుంది. అప్పుడు మీకు ఈ టీవీ ని కేవలం రూ. 4 వేల రేంజ్ లోనే సొంతం చేసుకోవచ్చు.

ఇక ఈ స్మార్ట్ టీవీ లో ఉన్న ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో బిల్ట్ ఇన్ వైఫై, క్రోమ్ కాస్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. 60 హెర్జ్ రిఫ్రెష్ రేటు, 720 పీ సపోర్ట్ కూడా ఉంది. ఇక ఈ స్మార్ట్ టీవీని తక్కువ ఈఎంఐ ఆప్షన్‌తో కూడా కొనొచ్చు. నెలకు రూ.367 చెల్లిస్తే చాలు. ఈ టీవీ కొనొచ్చు. ఇక్కడ ఈఎంఐ టెన్యూర్ 24 నెలలు. అలాగే 18 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 468 చెల్లించాలి. ఇక ఏడాది టెన్యూర్ పెట్టుకుంటే.. నెలకు రూ. 677 కట్టాలి. ఇక ఆరు నెలల ఈఎంఐ కోసం నెలకు రూ. 1300 కట్టాల్సి వస్తుంది. ఇలా మీ టెన్యూర్ ప్రాతిపదికన ఈఎంఐ మారుతుంది. స్మార్ట్ టీవీ కొనాలనుకునేవారు వెంటనే ఈ ఆఫర్ నీ సద్వినియోగం చేసుకోవచ్చు.