Samsung: కేవలం రూ.12 వేలకే శాంసంగ్ ఫోన్.. ఫీచర్స్ గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ తయారీ సంస్థ శాంసంగ్ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వినియోగదారుల కోసం ఇప్పటికే మంచి మంచి స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తీసుకువచ్చిన శాంసంగ్ సంస్థ ఎప్పటికప్పుడు మరిన్ని కొత్త కొత్త ఫీచర్ లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను తీసుకువస్తూనే ఉంది. అంతేకాకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా అతి తక్కువ ధరకే మంచి మంచి స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తోంది. ఇకపోతే త్వరలోనే శాంసంగ్ సంస్థ త్వరలోనే మార్కెట్లోకి అతి తక్కువ ధర కలిగిన కొత్త స్మార్ట్ ఫోన్ ని విడుదల చేయబోతోంది.

దేశంలో 5జీ సేవలు వేగంగా విస్తరిస్తున్న తరుణంలో కంపెనీలు 5జీ ఫోన్‌లను పెద్ద ఎత్తున విడుదల చేస్తున్నాయి. మొదట్లో భారీ ధరతో వచ్చిన ఈ ఫోన్‌లు ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజ సంస్థలు సైతం బడ్జెట్‌ ధరలో 5జీ ఫోన్‌లను లాంచ్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సామ్‌సంగ్ మార్కెట్లోకి బడ్జెట్‌ ధరలో 5జీ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. దీంతో పాటు మరో మిడ్‌ రేంజ్‌ ఫోన్‌ను సైతం తీసుకొచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే.. సామ్‌సంగ్ గెలాక్సి ఎం15, గెలాక్సి ఎం55 పేరుతో రెండు ఫోన్‌లను లాంచ్‌ చేసింది. ఎం 15 5జీ స్మార్ట్ ఫోన్‌ విషయానికొస్తే.. ఈ ఫోన్ బేసిక్‌ వేరియంట్ ధర రూ. 12,299కి అందుబాటులో ఉంది. ఇకపోతే ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.5 ఇంచెస్‌తో కూడిన్‌ ఫుల్‌హెచ్‌డీ+ సూపర్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు.

ఈ ఫోన్‌ మీడియాటెక్ డైమెన్‌సిటీ 6100+ ప్రాసెసర్‌ను అందించారు. 90Hz రిఫ్రెష్‌ రేట్ ఈ స్క్రీన్ సొంతం. ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరా, 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 25 వాట్స్‌కు సపోర్ట్‌ చేసే 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఇక సామ్‌సంగ్ తీసుకొచ్చిన మరో ఫోన్‌ ఎం 55. ఎం 54 ఫోన్‌కు కొనసాగింపుగా ఈ కొత్త ఫోన్‌ను తీసుకొచ్చారు. ఈ ఫోన్‌ ధర విషయానికొస్తే.. 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 26,999 , 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ రూ. 29,999గా నిర్ణయించారు. ఇక 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 32,999గా ఉంది. ఏప్రిల్‌ 8వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను అందుబాటులోకి రానుంది. అలాగే ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ సూపరల్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్లో స్నాప్‌డ్రాగన్‌ 7 జనరేషన్‌ 1 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసే ఈ ఫోన్‌లో 50 ఎంపీతో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. 45 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు.