కొంత సేపటికే మొబైల్ డేటా అయిపోతోందా… అయితే ఈ టిప్స్ పాటించండి..?

సాధారణంగా ప్రస్థుత కాలంలో సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందింది. స్మార్ట్ ఫోన్ లో వాడకం పెరిగిన తర్వాత ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటానికి మొబైల్ డేటా చాలా అవసరం. ఈ క్రమంలో ఎయిర్టెల్ జియో వంటి టెలికాం కంపెనీలు వినియోగదారులకు ఎన్నో డేటా ఆఫర్స్ అందుబాటులోకి తెచ్చాయి. ప్రతి ఏడు డేటా స్పీడ్ పెరగటం వల్ల మొబైల్ డేటా కూడా తొందరగా అయిపోతుంది. మొన్నటి వరకు ఫోర్ జి ఇంటర్నెట్ స్పీడ్ ఉండేది. ప్రస్తుతం జియో టెలికాం సంస్థ ఇంటర్నెట్ స్పీడ్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ క్రమంలో డేటా ఆన్ చేసిన కొంత సమయానికి రోజువారీ గడవు తీరకముందే డేటా అయిపోతుంది.

అయితే మనం తక్కువ డేటా ఉపయోగించినా కూడా మన మొబైల్ లో ఉండే బ్యాక్ ఎండ్ యాప్స్ వల్ల మొబైల్ డేటా తొందరగా అయిపోతుంది.ఇలా డేటా అయిపోయినప్పుడు కొన్ని రకాల యాప్స్ వాడకపోవడం మంచిది. అలాగే ప్లే స్టోర్ లో యాప్ అప్ డేట్స్ ను కూడా డిసెబుల్ చేయాలి. అయితే డేటా సేవ్ చేయటానికి కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఆ టిప్స్ గురించి తెలుసుకుందాం.

ఆటోమెటిక్ డౌన్ లోడ్ ఆఫ్ : డేటా సేవ్ చేయటానికి

మనం తరచూగా వాడే కొన్ని రకాల యాప్స్ లో ఆటోమెటిక్ డౌన్ లోడ్ అనే ఆప్షన్ డియాక్టివేట్ చేయాలి. ఇలా చేయడం ద్వారా మనకు అవసరం లేని మీడియా ఫైల్స్ డౌన్ లోడ్ అవ్వవు. అందువల్ల మొబైల్ డేటా ఎక్కువ సమయం వస్తుంది .

గూగుల్ ఆఫ్ లైన్ మ్యాప్స్ :

సాధారణంగా మనకు తెలియని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు గూగుల్ మ్యాప్స్ ను ఉపయోగిస్తాం. అయితే తరచూ గూగుల్ మ్యాప్స్ ను వాడడం వల్ల ఎక్కువ డేటా అవసరం అవుతుంది. అందువల్ల ఆఫ్ లైన్ గూగుల్ మ్యాప్స్ ను ఇన్ స్టాల్ చేసుకుంటే డేటా సమస్య ఉండదు. అలాగే అత్యవసర సమయాల్లో కూడా గూగుల్ మ్యాప్స్ ఉపయోగకరంగా ఉంటుంది.

డైలీ డేటా యూసేజ్ లిమిట్ :

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఆండ్రాయిడ్ ఫోన్ లు ఉపయోగిస్తున్నారు. మనం వాడే యాండ్రాయిడ్ ఫోన్లో డైలీ డేటా యూసేజ్ లిమిట్ ను సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని సెట్టింగ్స్ లో ఎనేబుల్ చేసుకొని డేటా వివరాల గురించి నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ నోటిఫికేషన్స్ ద్వారా మన డేటా తొందరగా పూర్తి అవ్వకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది.