డబ్బు ఆదా చేసే గీజర్.. ఇప్పుడు తక్కువ దరకే పొందండిలా…?

శీతాకాలం మొదలవగానే చలికి తట్టుకోలేక ప్రతి ఒక్కరూ ఏదైనా వేడివేడిగా ఉండాలని అనుకుంటారు. ముఖ్యంగా శీతాకాలంలో స్నానం చేయడానికి వేడి నీరు తప్పనిసరిగా ఉండాలి. అయితే పూర్వకాలంలో నీళ్లు వేడి చేయడానికి కట్టలు ఉపయోగించేవారు. కానీ ప్రస్తుత కాలంలో ఈ ఉరుకులు పరుగుల జీవితంలో కట్టెలు పెట్టి నీరు వేడి చేసే సమయం లేకపోవడంతో ప్రతి ఒక్కరు ఎలక్ట్రిక్ గీజర్లు ఉపయోగిస్తున్నారు. అయితే గీజర్లు కొనటం అందరికీ సాద్యం కాదు. ఎందుకంటె అవి ఎక్కువ ధర ఉండటం వల్ల కులిపనులు చేసుకొనువారు ఎక్కువ ధర చెల్లించి వాటిని కొనలేరు.

అయితే ప్రస్తుతం గీజర్ తక్కువ ధరకే ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఫ్లిప్ కార్ట్ తాజాగా ఒక గీజర్ కి ప్రయత్నంగా ఒక బకెట్ అందుబాటులోకి తెచ్చింది. దీని ధర కూడా చాలా తక్కువ. అలాగే తక్కువ విద్యుత్ తో ఇది పనిచేస్తుంది. అభిరామ 20 ఎల్ ఇన్స్టంట్ అనే ఈ వాటర్ గీజర్ ఫ్లిప్ కార్ట్ నుండి 1,599 రూపాయలకే కొనుగోలు ఆఫర్ ను ప్రకటించింది. దీని అసలు ధర మాత్రం రూ.2,499. కానీ డిస్కౌంట్ తర్వాత దీనిని కేవలం రూ.1599 కే పొందవచ్చు . అంతే కాకుండా ఉత్పత్తిపై కస్టమర్లకు కంపెనీ ఒక ఏడాది పాటు వారంటీ కూడా ఇస్తోంది.

అంతే కాకుండా దీని కొనుగోలుపై ఫ్లిప్ కార్ట్ పది రోజులపాటు రీప్లేస్మెంట్ ఆఫర్ కూడా ఇస్తోంది.ఈ మల్టీ పర్పస్ హీటర్ 20 లీటర్ల సామర్థ్యం గల ఈ గీజర్ లాంటి బకెట్ నిమిషాలలో నీటిని వేడి చేస్తుందని..ఈ ఉత్పత్తి స్నానం చేయడానికి త్రాగడానికి వంటగదికి మరియు అనేక రకాల ప్రయోజనాల కోసం తయారుచేసినట్లుగా ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది. అంతే కాకుండా ఇది షాక్ ప్రూఫ్ డిజైన్ తో తయారు చేయబడింది.అలాగే ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి దీనిని తీసుకొని వెళ్ళటం కూడా చాలా సులభం.