డబ్బు ఆదా చేసే ఎలక్ట్రిక్ స్టౌ… తక్కువ దొరికే మీ సొంతం చేసుకోండి!

ప్రస్తుత కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. దీంతో మధ్య తరగతి ప్రజలు నిత్యావసర వస్తువులు కొనటానికి కూడా ఎన్నో అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా వంట వండుకోవటానికి ఉపయోగించే గ్యాస్ సిలిండర్లు కూడా రోజురోజుకి ధర పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో చాలామంది ప్రజలు గ్యాస్ సిలిండర్లకు అధిక మొత్తంలో డబ్బు చెల్లించలేక ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు, ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్ వంటి వాటిని ఉపయోగించి వంట వండుకుంటున్నారు. అధిక ధర చెల్లించి గ్యాస్ సిలిండర్లు కొనలేని ప్రజలు అతి తక్కువ ధరలో దొరికే ఈ ఎలక్ట్రిక్ స్టవ్ కొనుగోలు చేయటం వల్ల మరింత డబ్బు ఆదా చేయవచ్చు. డబ్బు ఆదా చేసే ఈ ఎలక్ట్రిక్ స్టవ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధరలు రోజురోజుకీ పెరిగిపోవటంతో మార్కెట్‌లో గ్యాస్‌ స్టవ్‌కు బదులు ఇండక్షన్‌ స్టవ్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ ఇండక్షన్ స్టవ్ ఉపయోగించి వంట చేయటం వల్ల కొంతవరకు డబ్బు ఆదా చేసినప్పటికీ వాటి మీద కొన్ని రకాల పాత్రలలో మాత్రమే వంట చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఒక కాయిల్ తో ఎలక్ట్రిక్ స్టవ్ ను ఉపయోగించి అన్ని రకాల పాత్రలలో వంట చేయడమే కాకుండా అత్యంత తక్కువ ధరకే ఆ స్టవ్ మనకి అందుబాటులో ఉంది.

ఈ అద్భుతమైన ఎలక్ట్రిక్ స్టవ్ పొందాలనుకునేవారు Amazon నుంచి BAJAJ VACCO 1000-వాట్ల మాన్యువల్ ఇండక్షన్ కుక్‌టాప్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ ఎలక్ట్రిక్ కుక్‌టాప్ ధర కేవలం రూ. 1,270 మాత్రమే. ఈ ఎలక్ట్రిక్ కుక్ టాప్ తో పాటు వినియోగదారులు అమెజాన్ నుండి కొన్ని ఆఫర్లను కూడా పొందవచ్చు. అలాగే బజాజ్ నుండి ఈ ఇండక్షన్ కుక్‌టాప్ ISI గుర్తు ఉన్న ‘తీటా’ కాయిల్ హీటర్‌తో అందుబాటులో ఉంది. అయితే దీనికి రెగ్యులేటర్ అందుబాటులో లేదు.

రెగ్యులేటర్ లేకపోవడం వల్ల ఈ ఎలక్ట్రిక్ కుక్ టాప్ మీద వంట చేయటానికి తక్కువ విద్యుత్ ఖర్చవుతుంది. దీంతో.. మీ డబ్బు కూడా ఆదా అవుతుంది. అంతే కాకుండా ఇది షాక్ ప్రూఫ్. కాబట్టి కరెంట్ షాక్ తగిలే ప్రమాదం లేదు. అలాగే, ఇందులో ఉడికించడం కూడా చాలా సులభం. ఇది పోర్టబుల్ కూడా. ఈ ఎలక్ట్రిక్ స్టవ్ ల నిర్వహణ చాలా సులభం. అంతే కాకుండా దీన్ని ఎక్కడికైనా సులభంగా తీసుకుపోవచ్చు. ఇక కంపెనీ క్లెయిమ్ ప్రకారం.. ఈ కాయిల్‌పై ఎలాంటి ఫ్రైయింగ్ పాన్ లేదా కుక్కర్ లేదా పాత్రనైనా ఉపయోగించవచ్చు. అలాగే ఏ ఆకారపు పాత్రనైనా ఇందులో ఉపయోగించి ఇష్టమైన ఆహారాన్ని తయారు చేసుకోవచ్చు.