వైఫై కనెక్షన్ స్లోగా ఉందా… అయితే ఈ సింపుల్ టిప్స్ ఫాలో కావాల్సిందే!

665011-546261-540020-wifi-hotspots

ప్రస్థుత కాలంలో స్మార్ట్ ఫోన్ వాడకం బాగా పెరిగిపోయింది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు. ఇంటర్నెట్ కోసం ప్రత్యేకంగా రీఛార్జ్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే కొన్ని సందర్భాలలో నెట్వర్క్ సరిగా లేకపోవడం వల్ల ఇంటర్నెట్ సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల ఇప్పుడు అందరూ తమ ఇంట్లో వైఫై కనెక్షన్ పెట్టుకుంటున్నారు. ఈ వైఫై కనెక్షన్ అధిక ధరతో కూడుకున్నది. వైఫై కనెక్షన్ కోసం రూ.2000 నుంచి రూ.4000 వరకు ఖర్చవుతుంది. ఆ తర్వాత మీరు ఒక ప్లాన్‌ని ఎంచుకొని ప్రతి నెలా రీఛార్జ్ చేసుకోవలసి ఉంటుంది. అప్పుడే మీ ఇంట్లో ఇంటర్నెట్ నడుస్తుంది.

ఈ విధంగా మనం ఎక్కువ డబ్బులను ఖర్చు చేసి వైఫై కనెక్షన్ తీసుకున్నప్పటికీ కొన్ని సార్లు సరైన సిగ్నల్స్ అందగా ఎంతో ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. ఇలా వైఫై సిగ్నల్స్ కనెక్షన్స్ లోగా ఉండటం వల్ల అనుకున్న పనులు సరైన సమయానికి జరగకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా ఫ్రొం హోమ్ చేసేవారికి ఇది చాలా ఇబ్బందికరంగా మారింది. అయితే ఇలా స్లోగా ఉన్నటువంటి వైఫై సిగ్నల్ చాలా ఫాస్ట్ గా ఉండాలి అంటే ఈ సింపుల్ టెక్నిక్స్ ఫాలో అయితే చాలు…

సాధారణంగా WiFi నుంచి మంచి ఇంటర్నెట్ స్పీడ్ పొందడానికి WiFi రూటర్ స్థానం సరిగ్గా ఉండటం అవసరం. సిగ్నల్స్ సరిగా లేని ప్రదేశంలో wifi రూటర్ ఇన్‌స్టాల్ చేసి ఉంటే ఇంటర్నెట్ వేగం నెమ్మదవుతుంది. ఇంటికి సెంటర్లో కొంచెం ఎత్తులో వైఫై రూటర్‌ని ఉంచితే సిగ్నల్స్ ఫాస్ట్ గా అందుతాయి. సాధారణంగా వైఫై సేవలను అందించే కంపెనీలు తమ వైఫై కనెక్షన్‌తో పాటు యాప్‌లను కూడా అందిస్తున్నాయి. WiFi కనెక్షన్ నెమ్మదిగా నడుస్తున్నట్లయితే యాప్‌ని ఉపయోగించడం వల్ల ఇంటర్నెట్ వేగాన్ని పెంచుకోవచ్చు.