పెళ్లికి సిద్ధమైన సమంత… 2025 ప్రేమించే భాగస్వామి అంటూ పోస్టు!

స్టార్‌ నటి సమంతతో విడాకుల అనంతరం అక్కినేని నాగచైతన్య రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గతవారం శోభితతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో సమంత సైతం మరో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు సామ్‌ షేర్‌ చేసిన ఇన్‌స్టా పోస్ట్‌ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

2025లో నమ్మకం, ప్రేమను అందించే భాగస్వామిని, పిల్లల్ని కోరుకుంటున్నట్లు ఆ పోస్ట్‌లో ఉంది. వృషభ, కన్య, మకర రాశి వారు 2025లో వీటిని పొందే అవకాశం ఎక్కువగా ఉంది అంటూ సామ్‌ ఓ పోస్ట్‌ తన ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. ఆ పోస్ట్‌లో 2025 ఏడాదిలో ఈ మూడు రాశుల వారికి ఎలా ఉందో తెలియజెప్పే జాబితాను పంచుకుంది. ఈ మూడు రాశుల వారు వచ్చే ఏడాది బిజీబిజీగా గడుపుతారని సామ్‌ షేర్‌ చేసిన జాబితాలో ఉంది.

అంతేకాదు ఈ రాశుల వారు వృత్తిపరంగా మెరుగుపడతారని, బాగా డబ్బులు సంపాదిస్తారని కూడా ఉంది. ఇంకా నమ్మకం, ప్రేమను అందించే భాగస్వామిని పొందుతారట. పిల్లల్ని కూడా పొందుతారు. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న లక్ష్యాలను కూడా పూర్తి చేస్తారట. ఆదాయ మార్గాలు పెంచుకోవడం, మరిన్ని అవకాశాలు సొంతం చేసుకుని మానసికంగా, శారీరకంగా బలంగా ఉంటారని అందులో ఉంది. ఇందులో ఉన్నవన్నీ జరగాలని కోరుకుంటున్నట్లు సామ్‌ ఈ సందర్భంగా తెలిపారు.