ట్విట్టర్ దారిలోనే ఇంస్టాగ్రామ్… ఇంస్టాగ్రామ్ యూజర్లు ఇకపై డబ్బు చెల్లించాల్సిందే!

ప్రస్తుతం ఉన్నటువంటి సోషల్ మీడియా యాప్స్ లో ఇంస్టాగ్రామ్ ఎంతో ఆదరణ పొందుతుంది ఎంతోమంది సెలబ్రిటీల నుంచి మొదలుకొని సాధారణ వ్యక్తుల వరకు ఇన్స్టాగ్రామ్ ద్వారా వారికి సంబంధించిన అన్ని విషయాలను పంచుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.3 బిలియన్ కంటే ఎక్కువ మంది యూజర్స్ ఉన్నారు. ఇందులో 500 మిలియన్ల మంది యూజర్లు రోజూ ఇన్‌స్టాగ్రామ్‌ను వాడుతుంటారు.అయితే ఇన్స్టాగ్రామ్ ద్వారా వారి అభిరుచులకు సంబంధించిన విషయాలను అందరితో పంచుకుంటూ ప్రతినెల భారీ ఎత్తున డబ్బులు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు.

ఇలా ఇంస్టాగ్రామ్ ఆదాయం ఆర్జించి పెట్టే మంచి వనరుగా కూడాను. ఎంతోమంది ఇన్‌స్టా యూజర్స్ ఇలా ఆదాయాన్ని గడిస్తున్నారు. తాజాగా ఇన్‌స్టా ‘టిక్’ మార్కులకు సంబంధించి పిడుగులాంటి వార్త అందుతోంది. సాధారణంగా ప్రముఖ వ్యక్తులకు బ్లూ టిక్ ఉండడం మనం చూసే ఉంటాము. ఇలా ట్విట్టర్లో కూడా ప్రముఖ వ్యక్తులకు బ్లూ టిక్ ఉంటుంది. ఎలోన్ మస్క్ ట్విట్టర్‌ని కొనుగోలు చేసిన తరువాత, టిక్ సబ్‌స్క్రిప్షన్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం పలు దేశాల్లో యూజర్ వెరిఫికేషన్ బ్యాడ్జ్ (బ్లూ టిక్) కోసం ట్విట్టర్ వినియోగదారులు నెలకు $8 చెల్లిస్తున్నారు.

ఈ పేయిడ్ వెరిఫికేషన్ ద్వారా ప్రముఖులే కాకుండా సాధారణ వ్యక్తులు కూడా ఈ బ్లూ టిక్ ని కొనుగోలు చేయవచ్చు అయితే ఇకపై ఇంస్టాగ్రామ్ లో కూడా బ్లూటూత్ ఉపయోగించే వారందరూ కూడా ఎకౌంట్ ప్రొఫైల్ వెరిఫికేషన్ కోసం ఇన్‌స్టాగ్రామ్‌ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకువచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతానికి, టెక్ దిగ్గజం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.