ఫోన్ పే వినియోగదారులకు గుడ్ న్యూస్… ఇకపై విదేశాలలో కూడా ఫోన్ పే సేవలు..!

ప్రస్తుత కాలంలో ఆర్థిక లావాదేవీలు జరపడం చాలా సులభతరంగా మారిపోయింది. కేవలం స్మార్ట్ ఫోన్ పట్టుకొని బయటికి వెళ్లకుండా ఇంట్లో కూర్చుని యూపీఐ పద్ధతి ద్వారా ఒక బ్యాంక్ అకౌంట్ నుండి మరొక బ్యాంక్ అకౌంట్ కి చిన్న పెద్ద తేడా లేకున్నా అన్ని రకాల ఆర్థిక లావాదేవీలు జరుపవచ్చు. ఇతర దేశాలతో పోల్చితే మన దేశంలో యూపీఐ. ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలు అధికంగా ఉన్నాయి. గతంలో కేవలం సందేశంలో ఉన్న వారికి మాత్రమే యూపీఐ ద్వారా డబ్బులు పంపే అవకాశం ఉండేది. కానీ ఫోన్ పే యూజర్ల అవసరాలకు అనుగుణంగా తరచూ కొత్త ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఈ క్రమంలో విదేశాలలో కూడా యూపీఐ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం యూపీఐ పద్ధతి ద్వారా స్వదేశంలో ఉన్న వారికి మాత్రమే కాకుండా విదేశాలలో ఉన్న వారికి కూడా డబ్బు పంపవచ్చు. ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటర్నేషనల్ యూపీఐ సేవలను ప్రారంభించిన దేశంలోనే తొలి ఫిన్ టెక్ సంస్థగా అవతరించింది. ఈ సదుపాయం ద్వారా పేమెంట్స్ చేసినప్పుడు విదేశీ కరెన్సీ మీ ఖాతా నుంచి డిడెక్ట్ అవుతుంది. అంటే ఇది ఇంటర్నేషనల్ డిబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్‌తో సమానం.

ఇదిలా ఉండగా..ఈ విషయంపై ఫోన్‌పే సీటీఐ, కోఫౌండర్ రాహుల్ చారీ మాట్లాడుతూ..’ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు యూపీఐని అనుభూతి చెందేందుకు యూపీఐ ఇంటర్నేషనల్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు వెల్లడించారు. ఈ పద్ధతి విదేశాల్లో ప్రయాణించే భారతీయులు అక్కడ చెల్లింపులు చేసేందుకు ఎంతగానే ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. అయితే ఫోన్ పే యాప్‌లో యూపీఐ ఇంటర్నేషనల్ ఎంచుకున్నప్పుడు అందుకు తగినట్లుగా బ్యాంక్ ఖాతాను యాక్టివేట్ చేసుకోవలసి ఉంటుంది. విదేశీలకు వెళ్ళినప్పుడు అక్కడి నుంచే యాక్టివేట్ చేసుకోవచ్చు. తద్వారా భారత దేశం వెలుపల పేమెంట్స్ చేసేందుకు కస్టమర్లకు క్రెడిట్ కార్డ్, ఫారెక్స్ కార్డ్ అవసరం ఉండదని ఆయన తెలిపారు.