ఫేస్ బుక్ అంటే తెలియని వాళ్లు ఈలోకంలో ఉన్నారంటే మాత్రం అది ఓ వింతే. ఎందుకంటే.. ఫేస్ బుక్ చదువుకున్న వాళ్లకే కాదు.. చదువుకోని వాళ్లకు కూడా అంతగా పరిచయం అయింది. స్మార్ట్ ఫోన్ల పుణ్యమాని ఫేస్ బుక్ గురించి అందరూ తెలుసుకున్నారు. పల్లెటూరు, పట్నం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇప్పుడు ఫేస్ బుక్ ను వాడుతున్నారు. తమ పాత మిత్రులను కలుసుకుంటున్నారు. నిజానికి ఇది తమ ప్రెండ్స్, ఫ్యామిలీ నెట్ వర్క్ ను పెంచుకునే సోషల్ మీడియా నెట్ వర్కింగ్ సైట్.
ప్రస్తుతం ఫేస్ బుక్ కు ఎంత పాపులారిటీ ఉందో కూడా అందరికీ తెలుసు. దాని పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని తమ యూజర్లకు మరింత సులభమైన ఫీచర్లను అందుబాటులో తేవడానికి ఫేస్ బుక్ తన శాయశక్తులా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఉన్న లేఔట్.. క్లాసిక్ లుక్ కు స్వస్తి పలికి కొత్త లుక్ ను తీసుకురావడానికి ఫేస్ బుక్ సమాయత్తమవుతోంది.
ఇప్పటికే కొత్త ఫీచర్.. డార్క్ మోడ్ అందుబాటులో వచ్చినప్పటికీ.. అది కావాలంటే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఆ ఫీచర్ లోకి మారేలా అవకాశం ఉంది. వద్దనుకుంటే.. అదే క్లాసిక్ ఫీచర్ నే కొనసాగించుకోవచ్చు.
కానీ.. ఇక కొన్ని రోజులైతే క్లాసిక్ లుక్ కనిపించదు. వచ్చే నెలలోనే క్లాసిక్ లుక్ కు స్వస్తి పలికి కొత్త డార్క్ మోడ్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురావాలని ఫేస్ బుక్ యోచిస్తోందట.
అంటే.. ఫేస్ బుక్ యూజర్లందరికీ త్వరలోనే కొత్త లేఔట్ రానున్నదన్నమాట. ఈ ఫీచర్ క్లాసిక్ కన్నా చాలా ఈజీగా ఉంటుందని.. యూజర్లకు అన్ని ఆప్షన్లు ఈజీగా తెలిసేలా ఈ ఫీచర్ ను డిజైన్ చేసినట్టు ఫేస్ బుక్ తెలిపింది.