క్రెడిట్ కార్డు బిల్ పే చేయటం మరిచిపోయినా ఇకపై ఫైన్ చెల్లించాల్సిన అవసరం లేదు..!

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందటం వల్ల ప్రతి ఒక్కరు ఆర్థిక లావాదేవీలను మొబైల్ ఫోన్ల ద్వారానే చేస్తున్నారు. యూపీఐ, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డిజిటల్ పేమెంట్ చేస్తున్నారు. అంతే కాకుండా చాలామంది ప్రస్తుతం క్రెడిట్ కార్డు విధానంలోనే బిల్లులు చెల్లిస్తున్నారు. అయితే ఒకటి కంటే ఎక్కువగా క్రెడిట్ కార్డు ఉన్నవారు ప్రతి నెల గడువులోగా ఆ బిల్లులను కట్టడం మర్చిపోతున్నారు. ఇలా బిల్ పే చేయటం మర్చిపోయినా లేదా చెల్లింపు తేదీ కంటే మూడు రోజుల వెనుక కట్టినా కూడా ఫైన్ తో సహా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.

అయితే ఇకపై ఇలా ఫైన్ తో సహా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.

భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకారం క్రెడిట్ కార్డు జారీ చేసిన సంస్థ చేసిన చెల్లింపు కోసం మాత్రమే చార్జ్ చేయాలి. అయితే బిల్లు చెల్లించే తేది కంటే మూడు రోజుల వెనక చెల్లిస్తే మీ క్రెడిట్ కార్డు పై మనం చెల్లించిన ఎక్స్ట్రా డబ్బు కూడా మనం తిరిగి పొందవచ్చు. దీనికి సంబంధించిన వివరాలు మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

21 ఏప్రిల్ 2022న జారీ చేయబడిన క్రెడిట్ కార్డ్‌లు, డెబిట్ కార్డ్‌లకు సంబంధించిన సూచనల ప్రకారం.. క్రెడిట్ కార్డ్ ఖాతాలో మూడు రోజుల కంటే ఎక్కువ అప్పు ఉన్నప్పడు మాత్రమే కార్డ్ జారీ చేసేవారు క్రెడిట్ కార్డ్ లేట్ పేమెంట్ ఛార్జీని విధించవచ్చని RBI పేర్కొంది. అయితే చివరి తేదీ వరకు బిల్లు చెల్లించకపోతే మూడు రోజుల తర్వాత కూడా ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా చెల్లించుకోవచ్చని ఆర్బిఐ వెల్లడించింది. కొత్త క్రెడిట్ కార్డు తీసుకున్నవారు గడువు తేది ముగిసిన మూడు రోజుల తర్వాత కూడా పూర్తిగా అప్పు చెల్లించుకోలేకపోతే అప్పుడు తప్పకుండా క్రెడిట్ కార్డు పై అదనపు చార్జీలు విధిస్తుంది.