అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, యాపిల్ స్టోర్ లలో iPhone 13 ఎక్కడ చౌకగా దొరుకుతుందో తెలుసా?

పండుగల సీజన్ సందర్భంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లో అన్ని రకాల ఉత్పత్తులపై బంపర్ డిస్కౌంట్లను అందుబాటులోకి వచ్చాయి. ఇక ఇ-కామర్స్ కంపెనీలు స్మార్ట్‌ఫోన్‌పై ఒకటి కంటే ఎక్కువ ఆఫర్లను అందించాయి. అయితే ఈ పండుగ సీజన్ లో ఐఫోన్ ఆఫర్ ఎక్కువ మారింది. ఇప్పటికీ ఈ ఐఫోన్ కొనాలని ఆశపడేవారు పండగ సీజన్లో డీల్ మిస్ అయిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి వాటిలో ఇప్పటికీ ఐఫోన్ 13 మీద భారీ డిస్కౌంట్ లు ఉన్నాయి.

కొత్త ఐఫోన్ 14 లాంచ్ చేసిన తర్వాత, ఐఫోన్ 13 స్మార్ట్ ఫోన్ ధరను రూ. 10,000 తగ్గించింది. పదివేల రూపాయల ధర తగ్గింపు తర్వాత, ఈ ఐఫోన్ యొక్క బేస్ వేరియంట్ ధర రూ.69,900కి పెరిగింది. ఇక ఐఫోన్ 13 కొనాలని ఆశపడేవారు ఇప్పటికీ అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఆపిల్ స్టోర్ నుండి తక్కువ ధరకే ఈ ఐఫోన్ 13 సొంతం చేసుకోవచ్చు.

Amazonలో iPhone 13 యొక్క 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 3,000 తగ్గింపుతో జాబితా చేయబడింది, దీంతో దీన్ని రూ. 66,900కి కొనుగోలు చేయవచ్చు. అంతే కాకుండా ఎక్స్చేంజ్ ఆఫర్ కింద కస్టమర్ల పాత ఫోన్ కండిషన్ బట్టి దీనిపై రూ.14,050 తగ్గింపును కూడా పొందవచ్చు. ఇది కాకుండా, మీరు Amazon నుండి కొనుగోలు చేయడానికి Amazon Pay ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే, మీకు 5% క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది.

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13 చాలా చౌకగా రూ.65,490కి టీజ్ చేస్తోంది మరియు ప్లాట్‌ఫారమ్‌లో రూ.66,990కి లిస్ట్ చేయబడింది. ఫ్లిప్కార్ట్ లో సిటీ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీ ద్వారా కస్టమర్‌లు రూ. 2,000 తగ్గింపు పొందవచ్చు. ఇది కాకుండా, ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద కస్టమర్లకు రూ.18,500 అరకు తగ్గింపు కూడా ఇవ్వబడుతుంది.

ఇక Apple స్టోర్‌లో iPhone 13 ధర రూ. 69,900కి జాబితా చేయబడింది, ఇది దాని 128GB వేరియంట్ ధర. Apple ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్ కింద, కస్టమర్లు రూ. 2,200 నుండి రూ. 59,730 వరకు తగ్గింపులను పొందవచ్చు.