ప్రభుత్వ ఉద్యోగాలలో పని చేసే వారికి పిఎఫ్ అకౌంట్ ఉండడం సర్వసాధారణం. ప్రతినెల వారి జీతభత్యాలనుంచి కొంత అమౌంట్ కట్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే పిఎఫ్ ఖాతాలో ఉన్నటువంటి డబ్బులకు ప్రభుత్వం వడ్డీని చెల్లిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా 2022వ ఆర్థిక సంవత్సరానికి గాను పిఎఫ్ ఖాతాలో ఉన్న డబ్బును బట్టి 81 శాతం వడ్డీలను తమ ఖాతాలోకి జమ చేయనుంది. అయితే వడ్డీ డబ్బులు మన ఖాతాలో పడ్డాయో లేదో తెలుసుకోవాలంటే ఇలా చేస్తే చాలు.
ఎవరికైతే పిఎఫ్ అకౌంట్ లో పది లక్షలకు పైగా నిల్వ ఉంటుందో అలాంటి వారికి 81 వేల రూపాయల వడ్డీని ప్రభుత్వం చెల్లించనుంది అలాగే లక్ష రూపాయలు ఉన్నవారికి 8100 రూపాయల వడ్డీ వారి అకౌంట్లో పడుతుంది. అయితే మన అకౌంట్లో ఉన్న డబ్బును బట్టి అందుకు సరిపడా వడ్డీని చెల్లించనున్నారు. ఇకపోతే ఈ డబ్బులు మన అకౌంట్లో పడ్డాయో లేదో ఎలా తెలుసుకోవాలి అనే విషయానికి వస్తే..
పీఎఫ్ వడ్డీ డబ్బులు మన అకౌంట్ లో పడ్డాయో లేదో తెలుసుకోవడం కోసం ఈపీఎఫ్వో వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి కానీ ఉమాంగ్ యాప్ ద్వారా డబ్బులు క్రెడిట్ అయ్యాయో లేదో తెలుసుకోవచ్చు లేదంటే 011-22901406 నెంబర్ కి మిస్సేడ్ కాల్ ఇవ్వడం ద్వారా మన ఖాతాలో ఈ వడ్డీ డబ్బులు జమ అయ్యాయా లేదా అనే విషయాలను తెలుసుకోవచ్చు. అయితే అందరికీ ఈ డబ్బులు 81 వేల రూపాయలు పడవు మన అకౌంట్లో ఎంత డబ్బు ఉంటే ఆ డబ్బుకు 81 శాతం వడ్డీని మాత్రమే చెల్లిస్తారు.