వాట్సప్ యూజర్లకు అలర్ట్ … దీపావళి తర్వాత ఈ ఫోన్లో నో వాట్సప్..?

వాట్సప్ యూజర్లకు యాజమాన్యం పెద్ద షాక్ ఇచ్చింది. పాత ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో నడిచే డివైజ్‌లకు వాట్సాప్ యాక్సెస్‌ను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. వాట్సాప్ హెల్ప్ సెంటర్ పేజీలో పేర్కొన్న వివరాల ప్రకారం..ఐఫోన్ (Iphone) వినియోగదారులు వాట్సాప్ యాప్‌ను ఉపయోగించాలంటే, వారి డివైజ్ iOS 12, లేదా ఆ తర్వాత వచ్చిన ఐఓఎస్‌తో రన్ వాట్సప్ యాప్ ఉపయోగించాలంటే వారి డివైస్ ఆండ్రాయిడ్ ఫోర్ పాయింట్ వన్ లేదా ఆ తదుపరి వెర్షన్లో రన్ అవుతూ ఉండాలని వాట్సప్ యాజమాన్యం ప్రకటించింది.కొన్ని సేఫ్టీ, సెక్యూరిటీ చర్యల్లో భాగంగా.. పాత ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో నడిచే కొన్ని ఐఫోన్లకు వాట్సాప్ యాక్సిస్ ని నిలిపివేయని ఉన్నట్లు తెలిపింది.

అందువల్ల దీపావళి తర్వాత పాత ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టం ఉన్న యూజర్లు తమ డివైస్లను అప్గ్రేడ్ చేసుకోవాలని వెల్లడించింది. అక్టోబర్ 24వ తేదీ నుండి యాపిల్ ఐఫోన్ iOS 10, iOS 11 ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో నడుస్తున్న ఐఫోన్లలో వాట్సాప్ యాక్సిస్ నిలిపివేయనున్నట్లు యూజర్లకు తెలియజేసింది. ఈ యూసర్లు వాట్సాప్ ఉపయోగించాలంటే ఐఓఎస్ ని అప్డేట్ చేయాల్సి ఉంటుందని తెలిపింది.

అలాగే ఐఫోన్ 4, ఐఫోన్ 4S యూజర్లు కూడా ఇకపై వాట్సాప్ వినియోగించలేరు. ఎందుకంటే ఈ ఫోన్లో
కొత్త ఐఓఎస్‌కు అప్‌గ్రేడ్ చేయటానికి వీలులేదు. దీంతో ఆ యూజర్లు వాట్సాప్ వినియోగించాలంటే కొత్త ఫోన్ కొనుక్కోవాల్సి వస్తోంది. ఇక ఐఫోన్ 5, ఐఫోన్ 5C మోడళ్లను ఉపయోగించేవారు ఫోన్ iOS అప్డేట్ చేసి వాట్సాప్ ఉపయోగించవచ్చు. ఐఫోన్‌ ఆటో అప్‌డేట్‌లో లేకపోతే.. తాజా iOS వెర్షన్‌ కోసం సెట్టింగ్స్‌కు వెళ్లి జనరల్ సెట్టింగ్స్ విభాగం నుంచి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. దీనిపై ట్యాప్ చేసి, ప్రాసెస్ ఫాలో అయితే, డివైజ్ లేటెస్ట్ iOS వెర్షన్‌కు అప్‌డేట్ చేయవచ్చు.