ipl-2020 : మళ్లీ గెలుపు రుచి చూసిన పంజాబ్ , బెంగళూరుపై చివరి బంతికి విజయం…

punjab Beat Royal Challengers Bangalore By 8 Wickets
punjab Beat Royal Challengers Bangalore By 8 Wickets
punjab Beat Royal Challengers Bangalore By 8 Wickets

sharjah :ఐపీఎల్ 2020 సీజన్‌లో ఎట్టకేలకి కింగ్స్ ఎలెవవ్ పంజాబ్ మళ్లీ గెలుపు రుచి చూసింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకోగా.. ఓపెనర్లు దేవదత్ పడిక్కల్ (20: 18 బంతుల్లో 2×4, 1×6), అరోన్ ఫించ్ (18: 12 బంతుల్లో 1×4, 1×6) తొలి వికెట్‌కి 4 ఓవర్లలోనే 38 పరుగుల భాగస్వామ్యంతో మెరుగైన ఆరంభం ఇచ్చారు. అయితే.. దూకుడుగా ఆడే ప్రయత్నంలో ఇద్దరూ ఔటైపోగా.. అనంతరం వచ్చిన విరాట్ కోహ్లీ మరీ నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. ఇక డివిలియర్స్‌ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన వాషింగ్టన్ సుందర్ (13: 14 బంతుల్లో 1×4) నిరాశపరచగా.. శివమ్ దూబే (23: 19 బంతుల్లో 2×6) రెండు భారీ షాట్లతో సరిపెట్టాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు కారణంగా.. ఆరో స్థానంలో.. అదీ 16వ ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన ఏబీ డివిలియర్స్ (2: 5 బంతుల్లో) అంచనాల్ని అందుకోలేక 17వ ఓవర్‌లో ఔటైవగా.. బంతి వ్యవధిలోనే కోహ్లీ కూడా వికెట్ చేజార్చుకున్నాడు. దాంతో.. బెంగళూరు 17.5 ఓవర్లు ముగిసే సమయానికి 136/6తో తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది.

కానీ.. చివరి రెండు ఓవర్లలో క్రిస్‌ మోరీస్, ఇసుర ఉదాన (10 నాటౌట్: 5 బంతుల్లో 1×6) జోడీ ఆ టీమ్‌కి ఊహించని స్కోరుని అందించింది. 19వ ఓవర్‌ వేసిన క్రిస్ జోర్దాన్ బౌలింగ్‌లో సిక్స్ బాదిన మోరీస్ 10 పరుగులు రాబట్టగా.. చివరి ఓవర్‌ వేసిన షమీ బౌలింగ్‌లో మోరీస్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టేశాడు. ఇదే ఓవర్‌లో ఇసుర ఉదాన కూడా ఓ సిక్స్ బాదడంతో మొత్తం 24 పరుగులు వచ్చాయి. దాంతో.. బెంగళూరు 171 పరుగులు చేయగలిగింది.

172 పరుగుల లక్ష్య ఛేదనని పంజాబ్ టీమ్ ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (45: 25 బంతుల్లో 4×4, 3×6), కేఎల్ రాహుల్ దూకుడుగా ఆరంభించారు. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌ నుంచి టాప్‌గేర్‌లోకి వెళ్లిపోయిన మయాంక్ అగర్వాల్ ఎడాపెడా ఫోర్లు బాదేయగా.. స్లోగా కేఎల్ రాహుల్ కూడా జోరందుకున్నాడు. దాంతో.. 8 ఓవర్లు ముగిసే సమయానికి పంజాబ్ 78/1తో నిలిచింది. ఆ ఓవర్‌ చివరి బంతికి మయాంక్ ఔటయ్యాడు. అనంతరం ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన క్రిస్‌గేల్ క్రీజులో కుదురుకునేందుకు చాలా సమయం తీసుకున్నాడు. ఎంతలా అంటే..? అతను ఎదుర్కొన్న తొలి 15 బంతుల్లో చేసిన పరుగులు ఏడు మాత్రమే. అయితే.. ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాది టచ్‌లోకి వచ్చిన గేల్.. ఆ తర్వాత మహ్మద్ సిరాజ్‌కీ ఒక సిక్స్ బాదాడు. అనంతరం మళ్లీ ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో సుందర్‌ బౌలింగ్‌కిరాగా.. మరోసారి గేల్ రెండు సిక్సర్లు బాదేసి హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దెబ్బకి మ్యాచ్ కూడా 161/1తో పంజాబ్ చేతుల్లోకి వచ్చేసింది. కానీ.. ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన మోరీస్ 4 పరుగులే ఇవ్వగా.. 19వ ఓవర్‌లో ఉదాన 5 రన్స్ ఇచ్చాడు. దాంతో.. చివరి ఓవర్‌లో ఉత్కంఠ నెలకొంది. అయితే.. ఆఖరి బంతికి సిక్స్ బాదిన పూరన్ పంజాబ్‌ని గెలిపించాడు.