భారత్- ఆసీస్ క్రికెట్ మ్యాచ్ షెడ్యూల్ విడుదల

ఇండియాలో ఆసీస్ క్రికెట్ జట్టు పర్యటన ఖరారైంది. ఈ టూర్ లో భారత్- ఆసీస్ మధ్య రెండు టి20లు, 5 వన్డేలు జరగనున్నాయి. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 13 వరకు ఆసీస్ భారత్ లో పర్యటించనుంది. ఈ టూర్ కు సంబంధించిన షెడ్యూల్ ను బిసిసిఐ ప్రకటించింది.

భారత్- ఆసీస్ క్రికెట్ మ్యాచ్ షెడ్యూల్ ల వివరాలు ఇవే

టీ20 షెడ్యూల్

ఫిబ్రవరి 24 – తొలి టీ20 – బెంగళూరు
ఫిబ్రవరి 27 – రెండో టీ20 – విశాఖపట్నం

వన్డే షెడ్యూల్ 

మార్చి 2 – తొలి వన్డే – హైదరాబాద్
మార్చి 5 – రెండో వన్డే – నాగపూర్
మార్చి 8 – మూడో వన్డే – రాంచీ
మార్చి 10 – నాలుగో వన్డే – మొహాలీ
మార్చి 13 – ఐదో వన్డే – ఢిల్లీ