సెక్స్ కోరికలనేవి ఇద్దరికీ సమానంగా ఉంటాయి. స్త్రీ, పురుషుల్లో సమానంగా లైంగిక కోరికలు ఉంటాయి. కాకపోతే స్త్రీలు త్వరగా బయటపడరు. అబ్బాయిలు పడతారు అంతే తేడా. ఇక మగావారి మెదడు.. ఒకానొక వయసులో నిత్యం శృంగారం గురించే ఆలోచిస్తూ ఉంటుందట. అంతెందుకు వారు నిద్రలో కూడా అలాంటి కలలే కంటూ ఉంటారు. అలాంటప్పుడు చాలా మందికి వీర్య స్కలనం కూడా అయిపోతుంది. దీనినే స్వప్న స్ఖలనం అంటారు. కలలు రాకపోయినా కూడా స్వప్న స్ఖలనం జరుగుతుంది. యుక్త వయసులో ఇలాంటివి పురుషుల్లో చాలా సహజంగా జరగుతుంటాయి.
ఇక అమ్మాయిల విషయానికి వస్తే… ఇదే అనుభూతి స్త్రీలు కూడా పొందుతారని ఓ సర్వేలో తేలింది. పురుషులకంటే.. వీర్యం బయటకు వస్తుంది కాబట్టి.. ఈ విషయం బయటపడింది. స్త్రీలకు ఆ అవకాశం లేదు కాబట్టి ఈ విషయాన్ని పరిశోధకలు కాస్త ఆలస్యంగా కనుగొన్నారు. వారు చెప్పిన దాని ప్రకారం.. శృంగారానికి సంబంధించిన కలలు వచ్చినప్పుడు తమకు తెలీకుండానే స్త్రీలు భావప్రాప్తికి గురౌతారని నిపుణులు చెబుతున్నారు. . దాదాపు 40 శాతం మంది మగువలు నిద్రించే సమయంలో భావప్రాప్తి పొందుతున్నారని తాజా అధ్యయనం తేల్చింది. కళ్లను వేగంగా కదల్చడం వల్ల కలే అయినప్పటికీ మెలకువగా ఉన్నప్పుడు జరిగినట్లుగానే మెదడు స్పందిస్తుందట.
నరాలతో మెదడుకు ఉండే అనుసంధానం వల్ల కలను కూడా అది నిజమేనని భావిస్తుందని, ఆ సమయం లో మర్మంగాలు మరింత సున్నితం గా మారతాయని పరిశోధకులు తెలిపారు. అది కలలో జరిగినప్పటికీ స్త్రీల మొదడు మాత్రం నిజంగా జరిగినట్లే అనుభూతి పొందుతుంది. వారు నిద్రించే భంగిమ బట్టి ఈ విషయాన్ని తెలియజేయవచ్చు అని పరిశోధకులు చెబుతున్నారు.