గంగూలీని భయపెట్టిన సచిన్. ఎలానో తెలిస్తే షాక్!!

సచిన్ టెండూల్కర్ ని అభిమానించని క్రికెట్ అభిమానులు ఉండకపోవచ్చు. అతని పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానుల్లో ఉండటం కూడా సహజమే. అయితే సచిన్ కి సంబంధించిన ఒక సీక్రెట్ రివీల్ చేసాడు భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. సచిన్ కి నిద్రలో లేచి నడిచే అలవాటు ఉందని ఆయన వెల్లడించాడు. బ్రేక్ ఫాస్ట్ విత్ ఛాంపియన్ షోలో ఈ విషయాన్ని తెలిపాడు గంగూలీ.

ఒకసారి ఇంగ్లాండ్ టూర్ కి వెళ్ళినప్పుడు ఇద్దరు హోటల్ లో ఒకే రూమ్ లో బస చేశారట. అప్పుడే గంగూలీ సచిన్ నిద్రలో నడుస్తాడని గమనించాడట. రాత్రి నిద్రపోతున్న సమయంలో ఎదో శబ్దం వచ్చినట్టు అనిపిస్తే కళ్ళు తెరచి చూశాను. సచిన్ నడుస్తూ కనిపించాడు. బాత్ రూమ్ కి వెళ్తున్నాడేమో అనుకుని తిరిగి నిద్రపోయాను. కానీ రెండో రోజు, మూడో రోజు కూడా అలానే అయ్యింది. ఇంక నాలో భయం మొదలయ్యింది. అసలు నిద్రలో లేచి రాత్రిళ్ళు సచిన్ ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలి అనుకున్నాను.

తర్వాతి రోజు నిద్రపోకుండా మెలకువగా ఉండి అతడిని గమనించాను. సచిన్ ఒంటిగంట దాటుతున్న సమయంలో నిద్రలో లేచి రూమ్ అంతా తిరిగొచ్చి కుర్చీలో కూర్చున్నాడు. కాసేపాగిన తర్వాత నా పక్కకి వచ్చి పడుకుని నిద్రపోయాడు. అసలు ఇలా ఎందుకు చేస్తున్నాడో తెలుసుకోవాలి అనిపించి మరుసటి రోజు సచిన్ ని అడిగాను. నన్ను భయపెట్టాలి అనుకుంటున్నావా అలా చేస్తున్నావ్ రాత్రిళ్ళు అని ప్రశ్నించాను. సచిన్ చెప్పిన సమాధానం విని షాక్ అయ్యాను. తనకు నిద్రలో నడిచే అలవాటు ఉందని చెప్పాడు సచిన్ అని వివరించాడు గంగూలీ.