హ్యాపీ మూడ్.. క్రికెటర్ భార్య వేసిన స్టెప్పుల‌కు నెటిజ‌న్స్ ఫిదా

సోష‌ల్ మీడియా ప్రాచుర్యంలోకి వ‌చ్చాక సామాన్యులు, సెల‌బ్రిటీలు త‌మ‌లోని టాలెంట్‌ను ప్ర‌జ‌ల ముందుకు తీసుకొస్తున్నారు. వెర‌టై డ్యాన్స్‌లు చేయ‌డం లేదంటే ప‌లు ర‌కాల వంట‌కాలు వండ‌డం, ఫేమ‌స్ డైలాగ్స్‌కు అదిరిపోయే ప‌ర్‌ఫార్మెన్స్ ఇవ్వ‌డం చేస్తూ నెటిజ‌న్స్‌ను థ్రిల్ చేస్తున్నారు. కొంద‌రైతే సోష‌ల్ మీడియాతో రాత్రికి రాత్రే ఓవ‌ర్ నైట్ స్టార్ అవుతున్నారు. పోస్ట్‌ల‌తో మ‌నీ సంపాదించ‌డం కూడా జ‌రుగుతూ వ‌స్తుంది. ఇదిలా ఉంచితే టీం ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహాల్ పెళ్ళి చేసుకోనున్న ధ‌న‌శ్రీ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌. ఆమె త‌న డ్యాన్స్‌ల‌తో నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో అల‌రిస్తూ ఉంటుంది.

యూట్యూబ‌ర్ అయిన ధ‌న‌శ్రీ స్వ‌త‌హాగా డ్యాన్స‌ర్ . సోష‌ల్ మీడియాలో త‌ర‌చు డ్యాన్స్‌లు చేస్తూ నెటిజ‌న్స్‌కు ప‌సందైన వినోదం అందిస్తూ ఉంటుంది. తాజాగా ఆమె ఒక సాంగ్ కు డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ధనశ్రీ వర్మకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. టోని కక్క‌ర్ సోనా సోనా అనే పాట‌కు ధ‌న డ్యాన్స్ చేయగా, ఆమెతో పాటు మ‌రో మ‌హిళ కూడా డ్యాన్స్ చేసింది. ఈ వీడియోలో ధ‌నశ్రీ వేసిన డ్యాన్స్ ప్రొఫెష‌న‌ల్ డ్యాన్స‌ర్ మాదిరిగానే ఉంద‌ని కామెంట్ పెడుతున్నారు. గ‌తంలోను ధ‌న చేసిన చాలా వీడియోలు నెటిజ‌న్స్‌ని ఎంతగానో ఆక‌ట్టుకున్నాయి.

వృత్తిరీత్యా వైద్యురాలైన ధనశ్రీవర్మ.. ఈ ఏడాది ఆగస్టులో యుజ్వేంద్ర చాహల్ తో నిశ్చితార్థ కార్యక్రమం జరపుకుంది. ఇటీవల అత‌ను ఐపీఎల్ కోసం దుబాయ్ వెళ్లగా, ద‌న శ్రీ కూడా వెళ్లింది. వీరితో కేక్ క‌ట్ చేయించి సంబ‌రాలు జ‌రిపింది రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ టీం. ఇక ప్ర‌స్తుతం చాహ‌ల్ ఆస్ట్రేలియా సిరీస్‌తో బిజీగా ఉండ‌గా, దీని త‌ర్వాత ధ‌న‌శ్రీ మెడ‌లోమూడు ముళ్లు వేయ‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది.