IPL-2020: జడేజా మెరుపు ఇన్నింగ్స్ తో ఎట్టకేలకు గెలిచిన చెన్నై, కోలకతా ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతు!

chennai won by 6 wickets against kolkata

ఐపీఎల్-2020: సీజన్ ప్లేఆఫ్ రేసు నుంచి ఇప్పటికే నిష్క్రమించిన చెన్నై సూపర్ కింగ్స్.. గురువారం రాత్రి అనూహ్య విజయంతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ప్లేఆఫ్ ఆశలకీ గండికొట్టింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 173 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్.. చివరి 12 బంతుల్లో 30 పరుగులు చేయాల్సి వచ్చింది. ఈ దశలో సంచలన ఇన్నింగ్స్ ఆడిన రవీంద్ర జడేజా (31 నాటౌట్: 11 బంతుల్లో 2×4, 3×6).. ఆఖరి బంతికి సిక్స్ బాది చెన్నైని గెలిపించాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన ఫెర్గూసన్ నోబాల్ (హైట్) విసరగా.. ఫ్రీహిట్ బంతిని జడేజా సిక్స్‌గా మలచడం మ్యాచ్‌లో కీలక మలుపు. తాజా సీజన్‌లో 13వ మ్యాచ్ ఆడిన చెన్నైకి ఇది ఐదో గెలుపుకాగా.. కోల్‌‌కతాకి ఇది ఏడో ఓటమి. కోల్‌కతా మిగిలిన ఒక మ్యాచ్‌లో గెలిచినా.. ఆ జట్టు నెట్‌ రన్‌రేట్ -0.467గా ఉండటంతో ప్లేఆఫ్‌కి చేరడం కష్టమే. పట్టికలో టాప్-6లో ఉన్న ఏ జట్టుకి కూడా ఇంత తక్కువ నెట్ రన్‌రేట్ లేదు.

chennai won by 6 wickets against kolkata
chennai won by 6 wickets against kolkata

173 పరుగుల లక్ష్యఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్‌కి మెరుగైన ఆరంభం లభించింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (72: 53 బంతుల్లో 6×4, 2×6), షేన్ వాట్సన్ (14: 19 బంతుల్లో 1×4, 1×6) తొలి వికెట్‌కి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత ఇన్నింగ్స్ 8వ ఓవర్‌లో వాట్సన్‌ ఔటైనా.. అంబటి రాయుడు (38: 20 బంతుల్లో 5×4, 1×6)కలిసి దూకుడుగా ఆడిన గైక్వాడ్ రెండో వికెట్‌కి 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే.. జట్టు స్కోరు 118 వద్ద రాయుడు ఔటవగా.. అనంతరం వచ్చిన మహేంద్రసింగ్ ధోనీ (1: 4 బంతుల్లో) తక్కువ స్కోరుకే వికెట్ చేజార్చుకోవడం.. ఆ తర్వాత రుతురాజ్ కూడా సాహసోపేత షాట్ ఆడి బౌల్డవడంతో మ్యాచ్‌లో కోల్‌కతా పుంజుకుంది. అయితే.. చివరి రెండు ఓవర్లలో తెలివిగా బ్యాటింగ్ చేసిన జడేజా.. ఫెర్గూసన్ ఓవర్‌‌లో 20, నాగర్‌ కోటి వేసిన చివరి ఓవర్‌లో 15 పరుగులు రాబట్టేశాడు. చివరి బంతికి ఒక పరుగు అవసరమైన దశలో లాంగాన్ దిశగా సిక్స్ బాదిన జడేజా.. చెన్నైని గెలుపు సంబరాల్లో ముంచెత్తాడు.

chennai won by 6 wickets against kolkata
chennai won by 6 wickets against kolkata

మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో.. కోల్‌కతా ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన శుభమన్ గిల్ (26: 17 బంతుల్లో 4×4), నితీశ్ రాణా (87: 61 బంతుల్లో 10×4, 4×6) జోడీ తొలి వికెట్‌కి 7.2 ఓవర్లలో 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ప్రమాదకరంగా మారిన ఈ జంటని కర్ణ్ శర్మ విడదీశాడు. ఆ తర్వాత వచ్చిన సునీల్ నరైన్ (7: 7 బంతుల్లో 1×6), రింకు సింగ్ (11: 11 బంతుల్లో 1×4), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (15: 12 బంతుల్లో 2×4) దూకుడుగా ఆడే ప్రయత్నంలో వికెట్లు చేజార్చుకున్నారు. అయితే.. ఒక ఎండ్‌లో నిలకడగా ఆడిన నితీశ్ రాణా హాఫ్ సెంచరీ తర్వాత బ్యాట్ ఝళిపించేశాడు. దాంతో.. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో లుంగి ఎంగిడి రెండు, శాంట్నర్, జడేజా, కర్ణ్ శర్మ తలో వికెట్ పడగొట్టారు.