రౌడి బాయ్ విజయ్ దేవరకొండ సెలెక్ట్ చేసుకునే కథలు ఎలా ఉంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. చిన్న సైడ్ క్యారెక్టర్ నుంచి వచ్చి అగ్ర హీరోల స్థాయిలో క్రేజ్ అందుకుంటున్న రౌడి బాయ్ త్వరలో సుకుమార్ తో కూడా ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే అర్జున్ రెడ్డి లాంటి సినిమాతో వెండితెరపై హీటెక్కించ్చిన విజయ్ తో సుక్కు ఆ టైమింగ్ ను వాడుకోబోతున్నాడట.
అందరికంటే విభిన్నంగా ఆలోచించే సీనియర్ దర్శకుల్లో సుకుమార్ సంథింగ్ డిఫరెంట్ అనే చెప్పాలి. ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక పాయింట్ నెవర్ బిఫోర్ అనేలా ఉంటుంది. హీరోల పాత్రలను ఎంతో ఇంటిలిజెంట్ గా ప్రజెంట్ చేసే ఆయన నెక్స్ట్ పుష్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత విజయ్ తో చేసే సినిమాను ఇండో పాక్ వార్ నేపథ్యంలో తెరకెక్కిస్తారని సమాచారం.
ఇక విజయ్ దేవరకొండ మొదటిసారి దేశం కోసం పోరాడే సైనికుడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ కూడా మొదటి సారి తన జానర్ ను దాటి ప్రయత్నం చేయబోతున్నాడు. ఆయన గత సినిమాల మైండ్ గేమ్ తరహాలోనే సినిమా ఉంటుందట. ఇక అర్జున్ రెడ్డి లాంటి కసి ఉన్న కుర్రాడు దేశం కోసం పోరాడితే ఆ కిక్కు ఎలా ఉంటుందనే పాయింట్ ను హైలెట్ చేస్తారని రూమర్స్ అయితే బాగానే వస్తున్నాయి. మరి ఆ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే ఒక పోస్టర్ రిలీజ్ అయితే గాని అర్థం కాదు. అంటే వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.