లావణ్య త్రిపాఠి భారతీయ సినీనటి. తెలుగు, తమిళ, హిందీ భాషలలో నటించింది. 1991లో ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో జన్మించింది. ఈయన తండ్రి ఒక న్యాయవాది. ఈమెకు ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. చిన్నప్పటినుండే సినిమాలపై ఆసక్తి ఉన్నప్పటికీ తండ్రి కోరిక మేరకు ముంబై వెళ్లి రిషి దయారాం నేషనల్ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో పట్టా పుచ్చుకుంది.
చదువు పూర్తి అయిన తర్వాత మోడలింగ్ లో, టీవీ కార్యక్రమాలలోకి ప్రవేశించింది. 2006లో మిస్ ఉత్తరాఖండ్ కిరీటం గెలుచుకుంది. 2012లో అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ సినిమా మంచి గుర్తింపు తీసుకువచ్చింది. సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఇక నానితో కలిసి నటించినా భలే భలే మగాడివోయ్ సినిమా తన కెరీర్లో ది బెస్ట్ అని చెప్పాలి.
ఈ సినిమా విజయం సాధించి కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాతో తన క్రేజ్ బాగా పెరిగి అగ్ర హీరోల సరసన అవకాశాలు వచ్చాయి. తర్వాత ఈమె నటించిన సోగ్గాడే చిన్నినాయన చిత్రం మంచి విజయం ఇంకా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇక ఇండస్ట్రీలో లావణ్య త్రిపాఠి స్టార్ హీరోయిన్గా ఎదగడం ఖాయం అని ఫిక్స్ అయిపోయారు. అవకాశాలు కూడా అగ్ర హీరోల సరసన వచ్చేది.
ఆ తర్వాత వచ్చిన మిస్టర్ సినిమా తర్వాత కథ అడ్డం తిరిగింది శీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైంది కానీ అంతగా విజయం సాధించలేదు. ఆ తర్వాత శర్వానంద్ తో నటించిన రాధా చిత్రం కూడా ఆశించినంత ఫలితం చూపించలేదు. ఆ తరువాత నాగచైతన్యతో నటించిన యుద్ధం శరణం సినిమా కూడా విజయం సాధించకపోవడం.
ఇక సాయిధరమ్ తేజ్ సరసన ఇంటలిజెంట్ సినిమాలో నటించింది ఈ సినిమాను వివి వినాయక్ దర్శకత్వం వహించినందున కమర్షియల్ సక్సెస్ను సొంతం చేసుకుంటుంది అనుకున్నారు కానీ విడుదలైన మొదటి రోజే నెగటివ్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా. ఇలా వరుస సినిమాలు అనుకున్నంత విజయాలు సాధించకపోవడంతో అవకాశాలు కూడా తగ్గినట్లు తెలుస్తుంది.