రకుల్ ప్రీత్ సింగ్ ఇంత అందంగా ఉండటానికి కారణం అదే సీక్రెట్!

రకుల్ ప్రీత్ సింగ్ ఒక భారతీయ నటి. తెలుగు, తమిళం, హిందీ భాషలలో నటించింది. ఈమె 1990లో న్యూఢిల్లీలో జన్మించింది. ఈమె తండ్రి ఒక మిలిటరీ అధికారి. ఈమె తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ ‘రామ్ రాజ్య’ చిత్రంతో బాలీవుడ్ లో ప్రవేశించాడు. 2009లో కన్నడ చిత్రం గిల్లీ ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.

తెలుగులో కెరటం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ చిత్రం తెలుగు, తమిళంలో విడుదలైంది. వరుసగా లౌక్యం, పండగ చేస్కో, సరైనోడు, రారండోయ్ వేడుక చూద్దాం, ధ్రువ లాంటి చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగులోనే కాక తమిళంలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తక్కువ కాలంలోనే అగ్ర హీరోల చెంత నటించి అందరి మెప్పు పొందింది. రకుల్ 2021 నుండి నటుడు, నిర్మాత జాకీ భగ్నాని తో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2017 లో రకుల్ ను బేటి బచావో బేటి పడావో ఈ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది.

గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా తన బ్యూటీ కోసం స్పెషల్ గా ఎటువంటి క్రీములు వాడనని సహజంగా ఇంట్లోని బ్యూటీ టిప్స్ ఫాలో అవుతానని పెరుగు, పసుపు, మీగడ, గంధం లాంటి వాటినే ఫేస్ పై అప్లై చేస్తుందట. ఇక షూటింగ్ సమయంలో ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రాంతంలో ఉండే స్పెషల్ డిష్ లను తప్పకుండా రుచి చూడాల్సిందేనట.

మామూలుగా అయితే చాలామంది హీరోయిన్లు తినాలి అని ఉన్న కూడా కంట్రోల్ చేసుకొని తమ బ్యూటీ కోసం అన్ని పక్కన పెట్టేస్తుంటారు. కానీ రకుల్ మాత్రం ఫుడ్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాదు. తాను క్రమం ప్రకారంగా డైలీ ఫిట్నెస్ కోసం ఎక్సర్సైజ్ చేస్తూ ఏది కావాలంటే అది తినేస్తుందట.

2022 లో ఎటాక్,రన్ వే 24 చిత్రాలలో నటించింది. ప్రస్తుతం ఆమె రెండు మూడు సినిమాలు ఒప్పుకొని షూటింగ్లలో బిజీగా ఉన్నట్టు సమాచారం.