నా పర్సనల్స్ మీకెందుకూ.. సింగర్ సునీత ఫైర్!

Singer Sunitha

సునీత నేపథ్య గాయని, డబ్బింగ్ కళాకారిణి గా అందరికీ సుపరిచితమే. సునీత టీవీ కార్యక్రమాలలో వ్యాఖ్యాతగా, సహాయ దర్శకురాలిగా తన కెరీర్ ను ప్రారంభించింది. 15 సంవత్సరాల వయసులోనే చిత్ర పరిశ్రమలో గాయనిగా ప్రవేశించింది. కెరీర్ ప్రారంభించిన తర్వాత గులాబీ, ఎగిరే పావురమా సినిమాలు గుర్తింపు తెచ్చాయి.

తరువాత డబ్బింగ్ కళాకారిణిగా రాణిస్తూ తెలుగులో అనేక హీరోయిన్లకు గాత్ర దానం చేసింది. దాదాపు 500 సినిమాలు పైగా డబ్బింగ్ కళాకారిణిగా పనిచేసింది. ఇక ఈమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో దాదాపు 3 వేల సినిమా పాటలు పాడింది. 27 సంవత్సరాల సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో రివార్డులు, అవార్డులు ఆమె సొంతం చేసుకున్నారు.

సునీత బుల్లితెరపై ప్రసారమయ్యే నవరాగం, ఝుమ్మంది నాదం, సప్త స్వరాలు, పాడుతా తీయగా, జి సరిగమ లాంటి పలు సీరియల్ కార్యక్రమాలకు నిర్వహికురాలిగా, న్యాయమూర్తిగా అనేక రూపాలలో తన పాత్రను పోషించింది. ఇంకా బుల్లితెరపై ప్రసారమయ్యే అనేక సంగీత కార్యక్రమాలకు ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించింది.

ఇలా బిజీ గా కెరీర్లో ముందుకు సాగుతున్న సునీత గతంలో పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో భాగంగా తన పర్సనల్ లైఫ్ గురించి ప్రశ్న ఎదురైనప్పుడు స్పందిస్తూ తనపై చాలామంది ట్రోల్స్ చేస్తున్నారని వారికి నా పర్సనల్స్ లైఫ్ తో పనేంటి పేర్కొనడం జరిగింది.

తన జీవితంలో తను ఎలా ఉండాలి అనుకుంటే అలా ఉన్నానని చాలా సంతోషంగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నానని సోషల్ మీడియాలో చాలామంది వారికి ఇష్టం వచ్చినట్టుగా ట్రోల్స్ చేస్తున్నానని ఏదైనా చేసేముందు లేదా మాట్లాడే ముందు ఆలోచించి చేస్తే మంచిదని, ఏం చేసినా కాస్త సభ్యత సంస్కారం ఉంటే బాగుంటుందని పేర్కొనడం జరిగింది. సునీత ప్రస్తుతం సినిమాలలో గాయనిగా, డబ్బింగ్ కళాకారునిగా బిజీగా ఉన్నట్లు సమాచారం.