తమిళ డైరెక్టర్ తో పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఈషా రెబ్బ!

ఈషా రెబ్బ తెలుగు నటి. 1990లో తెలంగాణలోని వరంగల్లో జన్మించింది. విద్యాభ్యాసం అంత హైదరాబాదులో పూర్తిచేసి సినిమాలపై దృష్టి సారించింది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా ద్వారా 2012లో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. 2013 లో వచ్చిన అంతకముందు ఆ తర్వాత సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. దక్షిణాఫ్రికాలో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం ఉత్తమ చిత్రం కొరకు ప్రతిపాదించబడింది. ఆ తరువాత ఆమె బందిపోటు, అమి తుమి, మాయా మాల్, దర్శకుడు, ఆ! మొదలైన చిత్రాలలో నటించింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది.

తమిళంలో అవకాశాలు వచ్చి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన అన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది. అయితే తాజాగా ఈమె గురించి ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ఒక తమిళ డైరెక్టర్ ను ప్రేమించి, పెళ్లి చేసుకుంటుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇందులో వాస్తవం ఎంతుందో తెలియదు కానీ ఇది నిజమో కాదో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. ఇది నిజమా, అబద్ధమా అంటూ ప్రేక్షకులు సోషల్ మీడియాలో పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలోని వార్తలను నిజమని, అబద్ధమని తేల్చడం అంత సులభం ఏమి కాదు. కొంతకాలం ఆగాల్సిందే.

ఈషా రెబ్బ ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఈమె పిట్ట కథలు, త్రీ రోజెస్ లో నటించడం జరిగింది. వరుస అవకాశాలతో ముందుకు దూసుకుపోతున్న ఈ తెలుగు అమ్మాయి బిజీగా ఉంటే, మరోవైపు తన పెళ్లికి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది.