కె. రాఘవేందర్రావు తెలుగు చలనచిత్ర ప్రముఖ దర్శకుడిగా అందరికీ సుపరిచితమే. దర్శకుడు కె. సూర్య ప్రకాశరావు కుమారుడు. ఈయన తెలుగులోనే కాకుండా హిందీ సినిమాలకు కూడా దర్శకత్వం వహించడం జరిగింది.
తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోలైన వెంకటేష్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటివారు ఇతని దర్శకత్వంలోనే తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఇతను తన తండ్రి వద్ద సహాయ దర్శకుడిగా కొన్ని సినిమాలకు పని చేయడం జరిగింది.
1975లో శోభన్ బాబు నటించిన బాబు సినిమాకు దర్శకత్వం వహించి చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఇక అసలు విషయం ఏమిటంటే అక్కినేని నాగార్జున, కె. రాఘవేంద్రరావు కాంబినేషన్లో దాదాపుగా 9 సినిమాలు విడుదల కాగ.. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా రిజల్ట్ ఏంటో చూద్దాం.
అగ్ని పుత్రుడు: ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జునలు హీరోలుగా నటించారు. 1987లో విడుదలైన ఈ చిత్రం. బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ ను సాధించలేకపోయింది.
ఆఖరి పోరాటం: 1988 లో విడుదలైన ఈ చిత్రం. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ గా నిలిచింది.
జానకి రాముడు: 1988 లో విడుదలైన ఈ చిత్రం. బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది.
అగ్ని: 1989లో విడుదలైన ఈ చిత్రం. బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయం చోటుచేసుకుంది.
ఘరానా బుల్లోడు: 1995లో విడుదలైన ఈ చిత్రం. బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ సాధించింది.
అన్నమయ్య: 1997లో విడుదలైన ఈ చిత్రం. బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.
శ్రీరామదాసు: 2006లో విడుదలైన ఈ చిత్రం. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.
శిరిడి సాయి: 2012లో విడుదలైన ఈ చిత్రం. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా యావరేజ్ గా నిలిచింది.
ఓం నమో వెంకటేశాయ: 2017 లో విడుదలైన ఈ చిత్రం. బాక్సాఫీస్ వద్ద పరాజయం చోటుచేసుకుంది.
ప్రస్తుతం ఈయన ఇంటింటి అన్నమయ్య సినిమాకు దర్శకత్వం వహిస్తూ బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. 2022 డిసెంబర్లో ఈ సినిమా విడుదలకు రెడీ అవుతున్నట్లు సమాచారం.