అతడితో డేటింగ్ లో ఉన్నానని తెగేసి చెప్పేసిన చిన్నారి పెళ్ళికూతురు అవిక గోర్!

ఆ తర్వాత ఆమె కొంచెం ఎక్కువ బరువు పెరగడంతో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో కొంతకాలం సినిమాలకు బ్రేక్ తీసుకుని ‘రాజుగారి గది 3’ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో హీరో నాగార్జున ఓంకార్ డైరెక్షన్ లో నటించడం విశేషం. కానీ ఈ సినిమా కూడా పెద్దగా జనాలను ఆకట్టుకోలేకపోయింది.

తాజాగా తాను ప్రేమలో పడినట్లు వెల్లడించింది అవికాగోర్. తన మనసుని దోచుకున్న ప్రియుడిని సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం చేసింది. అయితే పెళ్లి మాత్రం ఇప్పట్లో చేసుకునే ఉద్దేశం లేదని, ప్రేమ జీవితం ఒక అందమైన అనుభవంలా ఉందంటూ చెప్పుకొస్తూ ప్రియుడితో దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఆమె ప్రియుడి పేరు మిలింద్ చద్వానీ. ఆమె తన ప్రార్థనలకి సమాధానం దొరికిందని ఇంకా ఆమెకు నిజమైన ప్రేమ దొరికిందని అందరికీ తెలియజేసింది.

ప్రేమలోని భావాలను మొదటిసారిగా బయటపెట్టిన అవికా..

మనకు నచ్చిన లక్షణాలున్న వ్యక్తి దొరకడం మన జీవితం లోకి రావడం కష్టమని అనుకుంటాం కానీ ఆమెకు మాత్రం ఆమె ఎలాంటివాడు కావాలో అలాంటి వ్యక్తే దొరికాడని తెగ సంబరపడి పోయింది అవికా గోర్. ఇదంతా తనకు ఒక కలలా ఉందని. ఆమె ఎలాంటి భావనకి గురవుతుందో మిగతా వారందరూ అదే అనుభూతిని పొందాలని ఆశిస్తున్నానంటు ఆమె మనసులోని మాటను అందరికీ తెలిపింది. తన ఈ బంధం తన జీవితంలో కీలక పాత్ర పోషించబోతోంది.. అంటూ అవికా తన సంతోషాన్ని అప్పట్లో తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ ద్వారా షేర్ చేసుకుంది.
అయితే ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది.