స్టార్ మా, ఈటీవీ చానల్స్ కి మంచి రేటింగ్స్ రావటానికి వేరే కారణం…?

ప్రస్తుతం మన టాలీవుడ్ బుల్లితెర ఛానెల్స్ గా స్టార్ మా, జీ తెలుగు, ఈటీవీ, జెమిని టీవీ సీరియల్స్, టీవి షో ల ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ శాతం నిజం. మా టీవిలో ప్రసారమవుతున్న టీవి షోలతో పాటు టీవి సీరియల్స్ కి కూడా మంచి రేటింగ్ రావటం వల్ల మా టీవి నంబర్ 1 స్థానంలో నిలిచింది. అయితే ఇలా మా టీవీ నంబర్ 1 గా నిలవటానికి ముఖ్య కారణం ఎవరూ? అంటే ఓంకార్ అనే పేరు వినిపిస్తోంది. మా టీవిలో ప్రసారమవుతున్న రియాలిటీ షోలను ఓంకార్ నిర్మిస్తూ..ఆయన సమర్పణలో టీవి షోలు ప్రసారమవుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా మాటీవీ కి మంచి వచ్చి నంబర్ 1 గా నిలవతానికి ఓంకార్ కారణం అంటున్నారు.

ఇక స్టార్ మా ఛానల్ లాగే ఈటీవీలో కూడా సీరియల్స్, టీవీ షోస్ ప్రసారం చేస్తూ ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోల ద్వారా ఈటీవీ కి మంచి రేటింగ్స్ దక్కుతున్నాయి. అయితే కేవలం మల్లెమాల వారు అందించే కంటెంట్ కారణంగానే ఈటీవీ టాప్ రేటింగ్ లో ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఢీ, జబర్ధస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, క్యాష్ వంటి టీవి షోలకు వచ్చే టాప్ రేటింగ్స్ వల్ల ఈటీవీ ఛానల్ కి మంచి రేటింగ్స్ వచ్చి మూడో స్ధానంలో నిలిచింది.

ఈటీవీలో ప్రసారమవుతున్న సీరియల్స్ కంటే టీవీ షోల ద్వారానే ఈ ఛానల్ కి మంచి గుర్తింపు లభించింది. అయితే మల్లెమాలవారి వల్లే ఈటీవీ కి ఈ స్థాయి లభించిందని చెప్పటంలో అతిశయోక్తి లేదు. అలాగే జీ తెలుగు ఛానల్ కూడా టీవీ షోలు సీరియల్స్ ద్వారా మంచి రేటింగ్స్ సొంతం చేసుకుని రెండో స్థానంలో నిలిచింది. ఇక చివరగా జెమినీ టీవీ అతి తక్కువ రేటింగ్స్ తో నాలుగవ స్థానంలో నిలిచింది. అయితే స్టార్ మా ఈటీవీ కి ఇలా మంచి రేటింగ్స్ రావడానికి కారణం ఓంకార్ మల్లెమాలవారు అని వినిపిస్తున్న వార్తలలో నూటికి నూరు ఉందని ప్రేక్షకులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.