పూరి జగన్నాథ్ వ్యక్తిత్వం గురించి బయటపెట్టిన నటి మాధవిలత!

Actress Madhavi About Drugs In Tollywood

మాధవి లత తెలుగు సినిమా నటి. తెలుగు, తమిళ భాషల్లో నటించింది. ఈమె ఒక రాజకీయ నాయకురాలు. 2008లో విడుదలైన నచ్చావులే చిత్రం ద్వారా హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఆ తర్వాత వరుస అవకాశాలతో ముందుకు రాణిస్తూ మంచి గుర్తింపు పొందింది.

2018లో భారతీయ జనతా పార్టీలో చేరి 2019లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయి, నాలుగవ స్థానంలో నిలిచింది. ఒకవైపు రాజకీయాలలో రాణిస్తూ, మరోవైపు సినిమాలో కూడా నటిస్తున్న మాధవి లత గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. అప్పుడు తెలుగువారికి సినిమా అవకాశాలు సరిగ్గా రాకపోవడం పై మీ అభిప్రాయం ఏంటి అనే ప్రశ్న ఎదురైంది.

అందుకు సమాధానంగా బయట వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ ఉన్నవారికి అంత ప్రాధాన్యత ఉండదు. ఎక్కడో నార్త్ నుండి కొత్త వారిని తీసుకువచ్చి పరిచయం చేస్తారు. టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలి. అందులో తప్పేమీ లేదు కానీ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ సంగతి కూడా కాస్త ఆలోచించాలి.

ఒకసారి తాను పూరి జగన్నాథ్ ఆఫీసుకు వెళ్లినప్పుడు ఆయనతో ఈ ప్రశ్న తాను అడిగినప్పుడు పూరి జగన్నాథ్ గారు ఒక సినిమాలో హీరోయిన్ కోసం ఒక కాలేజీకి వెళ్లి కొంతమంది అమ్మాయిలను సినిమాలలో నటిస్తారా అని అడిగితే అందుకు తమ ఇంట్లో ఒప్పుకోరని, కొంతమంది మాకు చాలా సిగ్గు అని రకరకాల సమాధానాలు చెప్పారు.

పూరి జగన్నాథ్ గారు ఇంటికి వెళ్లి మరి రిక్వెస్ట్ చేసిన తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను సినిమాలలో నటించడానికి అంగీకరించలేదు. మన తెలుగు వాళ్ళు కెమెరా ముందుకు రావడానికి పెద్దగా ఇష్టపడరు. అందువల్లనే రిస్క్ ఎందుకు అనుకొని బయట వాళ్ళను తీసుకోవడం జరుగుతుంది. అని పేర్కొనడం జరిగింది.

ఇలా మాధవి లత పూరి జగన్నాథ్ తో జరిగిన సంభాషణను మీడియాతో పంచుకుంది. ఏది ఏమైనా మీడియా ద్వారా మాధవి లత పూర్తిగా బయటి వారికే కాకుండా ఇక్కడి వాళ్లకు కూడా అవకాశాలు ఇస్తే బాగుంటుంది అని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇక రాజకీయాలలో రాణించాలని అటువైపుగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.