వామ్మో.. యాంకర్ రష్మీ గౌతమ్ ఎంత సంపాదిస్తుందో తెలుసా?

రష్మీ గౌతమ్ ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గురువారం, శుక్రవారం వస్తే చాలు టీవీల ముందు చేరిపోతారు జబర్దస్త్ చూసేందుకు.ఈమె 1988లో ఒరిస్సాలో జన్మించింది. కొంతకాలం తర్వాత తల్లిదండ్రులు విడిపోవడంతో తల్లితో పాటు విశాఖపట్నంలో వాళ్ల అమ్మమ్మ దగ్గర పెరిగింది. విద్యాభ్యాసం అంత విశాఖపట్నంలోని కొనసాగించింది. చదువుకునే రోజుల్లోనే సినిమాలలో నటించాలి అనే కోరికతో హైదరాబాద్ వచ్చింది.

2002లో సవ్వడి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. తర్వాత ఉదయ్ కిరణ్ నటించిన హోలీ సినిమాలో సహాయ పాత్రలో నటించింది. తర్వాత యువ అనే సీరియల్ లో కూడా నటించడం జరిగింది. తర్వాత తమిళంలో వచ్చిన శృంగార అనే చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రం 2011లో విడుదలై విజయం సాధించింది. తర్వాత రష్మీ జబర్దస్త్ షోకు యాంకర్ గా అవకాశం వచ్చింది. ఆ షో ద్వారా పాపులర్ అయ్యింది.

ఆ తరువాత వరుసగా కొన్ని సినిమాలలో నటించింది గుంటూరు టాకీస్ సినిమా మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఢీ జోడీలో కూడా హోస్టుగా నటించి మెప్పించింది. బుల్లితెర పై నటించే షో ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకొని పాపులర్ అయింది. ఒకపక్క యాంకరింగ్ చేస్తూ మరోపక్క అడపాదడపా వచ్చే అవకాశాలను వదులుకోకుండా సినిమాలలో నటిస్తుంది.

జబర్దస్త్ షో ద్వారా ఒక షోకు దాదాపు 40 వేల పారితోషకం తీసుకుంటున్నట్టు సమాచారం. ఇక సినిమాలలో అయితే తన క్యారెక్టర్ కు బట్టి లక్షల్లో రెమ్యూనరేషన్ ఉన్నట్టు తెలుస్తుంది. హైదరాబాదులోనీ మణికొండలో సొంతంగా ఒక అపార్ట్మెంట్ ఉంది. అంతేకాకుండా రెండు మూడు లక్షలు కార్లు కూడా ఈమె నివాసంలో ఉన్నాయి.

రష్మి గౌతమ్ ఖాళీ సమయాలలో డాన్స్ చేస్తూ పాటలు పాడడం అలవాటు. రష్మి గౌతమ్ కు నచ్చే యాంకర్ అనసూయ భరద్వాజ. రష్మీకి నచ్చే ఫుడ్ ఆలు పరోట ఇంకా పెరుగు . నచ్చే ప్రదేశం దుబాయ్. ఇలా అవకాశాలతో ముందుకెళ్తున్న రష్మీ గౌతమ్ దాదాపు రెండు కోట్ల వరకు ఆస్తులు సంపాదించినట్లు తెలుస్తుంది.