నటుడు ఆలీ జీవితంలో మరచిపోలేని సంఘటన.. ఆ టాక్సీ డ్రైవర్ అలా అనడంతో!

ఆలీ తెలుగు చలనచిత్ర నటుడిగా అందరికీ సుపరిచితుడే. తెలుగులో హాస్య పాత్రల ద్వారా బాగా ప్రసిద్ధి చెందాడు. బాల నటుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై దాదాపుగా 1000కి పైగా సినిమాలలో నటించాడు. కే విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ప్రెసిడెంట్ పేరమ్మ చిత్రంతో బాల నటుడుగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.

ఆ తర్వాత వరుసగా బాలనటుడుగా ఎన్నో చిత్రాలలో నటించాడు. 1981 లో వచ్చిన సీతాకోక చిలుక ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. 1994లో యమలీల సినిమాలో హీరోగా నటించడం ద్వారా ఇతని కెరీరే మలుపు తిరిగింది. తర్వాత ప్రముఖ హీరోల సినిమాలలో వరుసగా హాస్య పాత్రలలో నటించడం జరిగింది. తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ హాస్యనటులలో ఒకడుగా పేరు తెచ్చుకున్నాడు.

ఇలా వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న ఆలీ గతంలో ఒక టీవీ ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో ఎక్కువగా బాధపడ్డ సందర్భం ఏదైనా ఉందా అని ప్రశ్నించడం జరిగింది. అందుకు తన అమ్మ అంటే ఎంతో ఇష్టమని, తాను చనిపోవడం జీర్ణించుకోలేకపోయానని పేర్కొనడం జరిగింది.

తాను ఎక్కువగా బయట ఫుడ్ తినేవాడు కాదని, ఇంట్లో తన అమ్మ చేసిన వంటలు ఎంతో ఇష్టంగా తినేవాడని చెప్పడం జరిగింది. ఇంకా ఆ ఇంటర్వ్యూ ద్వారా తన జీవితంలో జరిగిన ఒక మరుపురాని సంఘటనను ఇంటర్వ్యూలో పంచుకోవడం జరిగింది. అదేమిటంటే తాను దుబాయిలో ఒకసారి ఫ్యామిలీతో టాక్సీ ఎక్కినప్పుడు ఆ ట్రాక్స్ డ్రైవర్ మీ పేరు ఆలీ కదా అని గుర్తుపట్టడం జరిగిందట.

అప్పుడు ఆలీ ఆ వ్యక్తి హైదరాబాద్ కు చెందిన వ్యక్తి అయి ఉంటాడు అనుకున్నాడట. కానీ ఆ టాక్సీ డ్రైవర్ ది ఆఫ్ఘనిస్తాన్ అని తెలియడంతో చాలా ఆశ్చర్యం కలిగిందని, లోకల్ లో అందరూ గుర్తు పడతారు కానీ ఇలా బయట దేశాలలో కూడా గుర్తుపట్టడం చాలా ఆనందంగా ఉందని, ఇంతకంటే కావాల్సింది మరొకటి ఏముంటుంది అని తెలపడం జరిగింది.

ఇక ఆలీకి విలన్ గా నటించాలనే కోరిక కూడా ఉందట. ప్రస్తుతం ఆలీ సినిమాలలో బిజీగా ఉంటూ.. మరొకవైపు బుల్లితెర లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా షోకు హోస్ట్ గా నిర్వహిస్తున్నాడు.