సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. ఇది చూడడానికి మాత్రమే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ చూడడం, తర్వాత పరిచయం ఏర్పడడం, అభిప్రాయాలు కలిసి ఒకటిగా అవ్వడం, తరువాత మనస్పర్ధలు వచ్చి విడిపోవడం చాలా కామన్.
ఇక అసలు విషయానికి వస్తే అక్కినేని నాగార్జున 1984లో డా.డి.రామానాయుడు కుమార్తె లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుడే నాగచైతన్య. ఆరు సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత 1990లో ఈ దంపతులు విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత నాగార్జున, అమలను వివాహం చేసుకున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నందినితో 2007లో విడాకులు తీసుకుని ఆ తర్వాత 2009లో రేణు దేశాయ్ ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక అమ్మాయి ఆద్య ఒక అబ్బాయి అకిరా ఆనంద్ సంతానం. కొంతకాలం తర్వాత వీళ్ళు 2012లో విడిపోవడం జరిగింది. తీన్మార్ సినిమాలో నటించిన అన్నా లెజోనోవా ను మూడవ వివాహం చేసుకున్నారు.
రాధిక 1985లో నటుడు ప్రతాప్ పోతన్ ను వివాహం చేసుకుంది. 1986లో విడాకులు తీసుకోవడం జరిగింది. ఇక 1990లో రిచర్డ్ హార్డే ను వివాహం చేసుకుంది. తర్వాత 1992లో విడాకులు తీసుకోవడం జరిగింది. ఇక 2001లో రాధిక, నటుడు శరత్ కుమార్ ను వివాహం చేసుకుంది.
హీరో సుమంత్, హీరోయిన్ కీర్తి రెడ్డి ని 2004లో వివాహం చేసుకున్నాడు. మనస్పర్ధలు కారణంగా 2006లో విడాకులు తీసుకోవడం జరిగింది.
ప్రకాష్ రాజ్ తమిళ నటి లలిత కుమారిని 1994లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. 2009లో విడాకులు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత 2010లో బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సోనీ వర్మను పెళ్లి చేసుకున్నాడు.
మంచు లక్ష్మి తనకు 20 సంవత్సరాల వయసులో ఒక వ్యక్తిని రహస్య పెళ్లి చేసుకుంది. తరువాత విడాకులు తీసుకుని 2006లో అంటి శ్రీనివాస్ ని పెళ్లి చేసుకోవడం జరిగింది.
కమల్ హాసన్ తనకు 24 సంవత్సరాల వయసు లో నర్తకి అయిన వాణి గణపతిని వివాహం చేసుకొని పది సంవత్సరాల కు విడాకులు తీసుకోవడం జరిగింది. తరువాత తన సహనటి సారికను వివాహం చేసుకున్నాడు. వీరికి శృతిహాసన్, అక్షర హసన్ లు సంతానం. 2004లో విడాకులు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత నటి గౌతమిని వివాహం చేసుకొని 2016లో విడిపోవడం జరిగింది.